బరితెగింపు


Fri,February 14, 2014 12:44 AM

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు వెళ్ళవలసిన
రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట! లోక్‌సభలో గురువారం సీమాంధ్ర సభ్యుల ప్రవర్తన అన్ని పరిమితులను దాటి పోయింది. ఇంతకూ ఈ సీమాంధ్ర పెత్తందారులు ఏమనుకుంటున్నారు? పార్లమెంటు అంటే తమ జాగీరుగా భావిస్తున్నారా? కొద్ది రోజులుగా రాజకీయ పార్టీల పెద్దలు ఉపేక్ష వహించడం, వీరు చెలరేగిపోవడం - ఇదేం తమాషా? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా, జమీందారీగిరీయా? కోట్లాది ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల సభలో ఈ వెకిలి చేష్టలేమిటి? గురువారం విధిలేని పరిస్థితుల్లో సీమాంధ్ర సభ్యులను ఈ సమావేశ కాలం ముగిసే వరకు బహిష్కరించినప్పటికీ ఇదొక కంటి తుడుపు చర్య? అసలు ఇంత దూరం పరిస్థితులు ఎందుకు దిగజారినట్టు? దీనిని ప్రేరేపిస్తున్నదెవరు? ఉపేక్షిస్తున్నదెవరు? సీమాంధ్ర పెత్తందారు లగడపాటి రాజగోపాల్ జంకు గొంకు లేకుండా లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చిమ్మడం ఎంత బరితెగింపు! గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులను పరాచికాలాడినట్టు అవహేళన చేయడం ప్రజాస్వామ్యానికే తలవంపులు కాదా? ఈ వాయువు ప్రభావం వల్ల అనేక మంది సభ్యులు అస్వస్థులై సభ నుంచి బయటకు ఉరకవలసి వచ్చింది. కొందరు ఆస్పత్రిలో చేరారు. పై భాగాన ఉన్న పాత్రికేయ విభాగానికి కూడా ఈ వాయువు పాకిందంటే ఎంత తెచ్చి కుమ్మరించారో తెలువదు. పార్లమెంటులో అనేక మంది సీనియర్ నాయకులు అనేక ఆరోగ్య సమస్యలతో ఉన్నారు. వారిపై ఈ వాయువు ప్రభావం ఎంత విపత్కరంగా ఉంటుందో తెలువదు.

సభా మర్యాదలన్నీ మంట గలిపిన ఈ జగడపాటి తన చర్యను సమర్థించుకుంటున్న తీరు మరింత జుగుప్సాకరంగా ఉన్నది. తనపై దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం ఈ వాయువును చిమ్మాడట! తెలంగాణలో కోట్లాది మంది ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నా సీమాంధ్ర సోదరీ సోదరులపై ఏనాడైనా దాడి జరిగిందా? తెలంగాణ ప్రజల ఔన్నత్యాన్ని ఇక్కడ స్థిరపడిన సీమాంధ్ర జనమే ప్రశంసిస్తున్నారు. ఈ జగడపాటి ఎన్ని బుడ్డర్‌ఖాన్ వేషాలు వేసినా నవ్వుకున్నారే తప్ప దాడులు జరిపారా? తమ నిరసనను ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరుపుతున్నారే తప్ప ఏనాడు ఆగ్రహ ప్రదర్శన హింసాయుతంగా జరపలేదు.

అటువంటిది ఈ పెద్ద మనిషి ఆత్మ రక్షణ కోసం ఈ హానికర వాయువును చిమ్మానంటే బుద్ధి జ్ఞానం ఉన్నవారెవరూ నమ్మరు. సీమాంధ్ర సభ్యులు కొద్ది రోజులుగా సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నా తెలంగాణ సభ్యులు ఓరిమితో ఉన్నారే తప్ప దాడులు చేయలేదు. అటువంటిది ఈ రోజు దాడి జరుగుతుందని భయపడే ఆస్కారమే లేదు. మరి ఈ జగడపాటి గౌరవనీయమైన సభలోకి హానికర వాయువును ఎందుకు తెచ్చుకున్నట్టు? జగడపాటికి తోడుగా కొందరు సభ్యులు సీనియర్ అధికారి బల్లపై అద్దాన్ని పగలకొట్టారు. మైక్‌ను పీకేశారు. ఓ కత్తిని చూపించాడని కూడా అంటున్నారు. కానీ తాను కత్తిని చూపలేదని, మైక్ పీకేశానని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటు. జగడపాటి అభ్యంతరకర ప్రవర్తనను యథాతథంగా వెల్లడించకుండా సీమాంధ్ర చానెల్స్ ఆయనను నెత్తిల పెట్టుకోవడం, ఆత్మరక్షణకే ఆ హానికర వాయువు చిమ్మినట్టు ప్రచారం చేయడం తీవ్ర అభ్యంతకరం. ఈ పెత్తందారులు పాత్రికేయ విలువలను కూడా అథఃపాతాళానికి తొక్కారు.

పెండ తట్టను నెత్తిలో పెట్టుకుని మోస్తే ఒళ్ళంతా కారి మురికవుతుంది. ఇంతకాలం ఈ సీమాంధ్ర లాబీని నెత్తిల పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో పార్లమెంటు సాక్షిగా కనబడుతూనే ఉన్నది. ఇప్పుడు ఈ లేకి మనుషులను చంకలేసుకుని ఇజ్జత్ పోడగొట్టుకోవడం తప్ప బీజేపీ బావుకునేదేమీ లేదు. ఒక ఓటు రెండు రాష్ర్టాలు అంటూ కాకినాడ తీర్మానం చేసిన బీజేపీ ఆ తరువాత అధికారానికి రాగానే చంద్రబాబును మోస్తూ బదనాం అయింది. మళ్ళీ అనేక వేదికలపై తెలంగాణకు మద్దతు ప్రకటించింది. తీరా సమయానికి వంకర మాటలు మాట్లాడుతున్నది. జాతీయ పార్టీగా, పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పార్టీతో సమానంగా బరువు బాధ్యతలు ఉంటాయి. ప్రజల దష్టిలో పార్లమెంటులో బలం కన్నా నిజాయితీ ప్రధానం. కానీ ఎన్నికల రాజకీయంలో భాగంగా తెలంగాణ బిల్లు విషయంలో నంగి మాటలు మాట్లాడడం దారుణం. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టారనేది స్పష్టం.

ఈ సందర్భంగానే సీమాంధ్ర నాయకులు గొడవ చేశారు. అయినా బీజేపీ మూడు నాలుగు పార్టీలను వెంటేసుకొని పోయి స్పీకర్‌ను కలిసి బిల్లు ప్రవేశ పెట్టినట్టు తాము గుర్తించబోమని దబాయించడం ఆ పార్టీ చెబుతున్న విధానానికి భిన్నం. బీజేపీ సీనియర్ నాయకులు ఇటువంటి పరిస్థితులు కల్పించక పోవలసింది. తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు వెళ్ళవలసిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నిండు సభలో జరిగిన అవమానానికి ఫలితాలు అంత కన్నా దారుణంగా ఉంటాయి.

269

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...