ఇంకేమి వదులుకోవాలి?


Sat,February 8, 2014 02:29 AM

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు
నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట!
పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసింది సీమాంధ్రకు ఏమియ్యాలని కాదు, తెలంగాణకు
జరిగిన నష్టం ఎట్లా పూడ్చాలని.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందన్న వార్త తెలంగాణ వారికి మండుటెండలో మంచినీళ్ళు తాగినంత ఉప్పొస కలిగిస్తున్నది. ఈ బిల్లును 12వ తేదీన రాజ్యసభలో పెడతామని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. అయితే తెలంగాణ జనం గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న బుగులు మాత్రం ఇంకా తొలగిపోలేదు. తెలంగాణ బిల్లు అసెంబ్లీ నుంచి ఢిల్లీకి చేరినప్పటి నుంచి తెలంగాణ మీద భయానక దాడి సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్న సంతోషం కూడా అనుభవించలేనంత తీవ్ర స్థాయిలో ఈ దాడి సాగుతున్నది.

తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న క్రమంలో సీమాంధ్ర వారికి ఏదో నష్టం జరుగుతున్నట్టు ప్రపంచమంతా ఇప్పుడు వారి బాధనే వినాలన్నట్టు మీడియా ప్రచారం సాగిస్తున్నది. అన్ని రాజకీయ పార్టీల ఎజెండా సీమాంధ్ర నాయకులను బుదగరించడమే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితిని తెచ్చి పెట్టింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వమా? ఇంత కాలం తెలంగాణకు మద్దతు ప్రకటించిన బీజేపీయేనా? సీమాంధ్ర పెత్తందారులు, మీడియా కుట్ర పూరితంగా ఈ పరిస్థితి తెచ్చి పెట్టారా? కారణమెవరైనా ఈ సీమాంధ్ర నాయకులను సంతుష్టి పరచాలనే భావజాలాన్ని బలంగా వ్యాపింప చేయడం మాత్రం బాగా విషపూరితంగా సాగుతున్నది. బిల్లును ఏ దశలో ఏ విధంగా ఎదుర్కోవాలె, ఎట్లా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొట్టాలనే విషయమై సీమాంధ్ర పెత్తందారులు మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారు. 2009 డిసెంబర్‌లో నోటి ముంగటి బుక్కను ఎత్తగొట్టిన దుర్మార్గం వారిది. మళ్ళీ ఈ చివరి దశలో తమ పన్నాగాలను మరింత లగాయించి చేస్తారనేది కనబడుతూనే ఉన్నది.

సీమాంధ్ర ప్రయోజనాలకు నష్టం ఏదో జరుగుతున్నదనే తప్పుడు ప్రచారం వెనుక ఉన్న ఎత్తుగడ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బకొట్టాలనేదే. రాష్ట్ర విభజన జరిగినా అన్యాయం జరుగుతున్నది తెలంగాణకే. చర్చ జరగవలసింది తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద. కానీ సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలనే ఆకాంక్ష చర్చకు కూడా నోచుకోవడం లేదు. అరు దశాబ్దాల పాటు అణచివేతకు, దోపిడీకి గురైన తెలంగాణ ను మళ్ళీ కోలుకునే విధంగా ఆర్థిక సహాయం అందించవలసిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. ఉద్యోగాలలో, ఉపాధిలో, నీటి పంపకంలో, నిధుల పంపిణీలో తీవ్ర అన్యాయం జరిగినందు వల్ల తెలంగాణ సమాజం చితికిపోయింది. లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమైనాయి.

ఇప్పుడు కోట్లాది తెలంగాణ ప్రజల మొహంలో చిరునవ్వులు ఎట్లా నింపాలనేది ఢిల్లీ పాలకుల ఎజెండా కావాలె. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ, కొత్త రాష్ట్ర ఫలా లు మాత్రం తామే అనుభవించే విధంగా సీమాంధ్ర నాయకులు కొర్రీలు పెట్టిస్తున్నారు. నీళ్ళ వాటాలో తంపులు పెడుతున్నారు. నిధులలో వాటా కావాలట. హైదరాబాద్ పై పట్టు విడువరట. ఉద్యోగులు ఇక్కడే తిష్ట వేస్తార ట. కొత్త విద్యా ఉద్యోగ అవకాశాలలో వాటా ఉండాలట. ఇట్లా అన్ని వాళ్ళ చేతిలో పెట్టిన తరువాత మళ్ళా రాష్ట్రం సాధించుకున్నది ఎందుకట? బిల్లులోని లోపాలపై చర్చ జరిపి తెలంగాణ వారికి న్యాయం జరిపించాలె. కానీ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ, సీమాంధ్ర మధ్య సీదాగా గీత గీసినట్టు జరగాలె. లెక్కలు గిక్కలు సాఫ్‌గా ఉండాలె. కానీ అట్లా జరుగుతనే లేదనేది తెలంగాణ వారి బాధ. బిల్లు ఢిల్లీకి పోయిన తరువాతనైనా తమకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దుతారేమోనని తెలంగాణ వారు ఆశపడ్డరు. కానీ అక్కడ పరిస్థితి ఉల్టాపల్టా చేసి ఇంకా అవ్వే దొంగ నాటకాలు ఆడుతున్నరు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే తెలంగాణ ఇస్తనంటున్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేపడతడు. అధికార పార్టీ ఎంపీలే పార్లమెంటులో గొడవ చేస్తున్నరు. ఇంత కాలం చిన్న రాష్ర్టాలు మా సిద్ధాంతమని, తెలంగాణకు మద్దతు ఇస్తామని నీతులు పలికిన బీజేపీ పెద్దలు సీమాంధ్ర నాయకులను మెప్పించాలని అంటున్నరు. వాళ్ళను మెప్పిస్తెనే తాము మద్దతు ఇస్తరట. కప్పను ఇడువుమంటే పాము వింటదా? ఇదెక్కడి నీతి? చెప్పెటోడికి తెలివి లేక పోతే వినెటోడికి వివేకం ఉండాలంటరు. సీమాంధ్ర పెత్తందారులు ఇజ్జతిడిచి అన్నీ కావాలని అడుగుతరు. కానీ ఈ బీజేపీ నాయకులు వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకునుడే బాగా లేదు. కాంగ్రెస్ నాయకులు మీటింగ్‌లు పెట్టి వాళ్లను బతిమిలాడుడు అంతకన్నా బాగలేదు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చుకుంటే వద్దంటలేం.

రాజధాని కట్టుకోవడానికి కోట్లు కుమ్మరించినా వద్దనే కండ్ల మంట మాకు లేదు. సీమాంధ్రకు విద్యా సంస్థలు, వైద్య సంస్థలు మొదలైనవన్నీ అడిగిన తీరుగ, చాతనైన కాడికి మంజూరు చేస్తే వద్దనేది లేదు. కని మళ్ళా ఉప్పేసి పొత్తు కూడుతం అంటే ఊకునేది లేదు. తెలంగాణ మీద పెత్తనం కావాలంటే ఇచ్చేది లేదు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసింది సీమాంధ్రకు ఏమియ్యాలని కాదు, తెలంగాణకు జరిగిన నష్టం ఎట్లా పూడ్చాలని. తెలంగాణకు సమన్యాయం జరగాలని చర్చించాలె. సంపూర్ణ తెలంగాణ ఇచ్చే విధంగా సవరణలు ఉండాలె.

216

Allam Narayana

Published: Sun,April 6, 2014 12:21 AM

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గ

Published: Sat,March 8, 2014 01:02 AM

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బ

Published: Tue,March 4, 2014 04:10 AM

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడద

Published: Sat,March 1, 2014 12:30 AM

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రం

Published: Fri,February 28, 2014 12:31 AM

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వార

Published: Wed,February 26, 2014 03:03 AM

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట

Published: Tue,February 25, 2014 12:57 AM

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యల

Published: Sat,February 22, 2014 01:24 AM

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద

Published: Fri,February 21, 2014 01:10 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Fri,February 21, 2014 01:09 AM

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగ

Published: Sat,February 15, 2014 01:08 AM

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిర

Published: Fri,February 14, 2014 12:44 AM

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌స

Published: Tue,February 11, 2014 12:13 AM

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవ

Published: Fri,February 7, 2014 01:08 AM

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకా

Published: Fri,January 31, 2014 12:31 AM

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలం

Published: Thu,January 30, 2014 12:33 AM

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగ

Published: Wed,January 29, 2014 02:24 AM

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎ

Published: Tue,January 28, 2014 02:24 AM

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్

Published: Mon,January 27, 2014 12:43 AM

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్

Published: Sat,January 25, 2014 12:56 AM

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెల

Published: Fri,January 24, 2014 12:09 AM

అతి పాత వాదనలు!

వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి విభజన అంగీకారం కాకపోవచ్చు. సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాలూ బాగుంటాయని నిశ్చితమైన అభిప్రాయమూ ఉండవచ్చు.

Published: Wed,January 22, 2014 12:36 AM

అణచివేతలు..అనుమతులు

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్

Published: Sat,January 11, 2014 02:36 AM

గుండె చప్పుడు

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిల

Published: Wed,January 8, 2014 12:47 AM

క్రయోజెనిక్ రహస్యం!

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా

Published: Fri,January 3, 2014 01:19 AM

స్వయంకృతం

శాసనసభ శీతాకాల సమావేశాల మలిదశ శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు? మంత్రి శ్రీధర్‌బా

Published: Thu,January 2, 2014 01:17 AM

కుట్రపూరితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆప

Published: Wed,January 1, 2014 01:03 AM

కొత్త కాలం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగం ఏ రూపు సంతరించుకుంటుందో, ఉద్యమ శక్తుల పాత్ర ఎట్లా ఉంటుందో తెలువదు. సొంత రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆం

Published: Sat,December 28, 2013 12:44 AM

అంతటా ఇవే నాటకాలు

సీమాంధ్ర నాయకులిప్పుడు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ చర్చలు అధ్యయనం చేసే పనిలో ఉన్నారట! అక్కడి తీర్మానాని

Published: Sun,October 6, 2013 01:58 AM

తెలంగాణకు శాంతి కావాలి

‘మరియు దేవుడు అన్నాడు.. అక్కడ వెలుతురు ప్రసరించాలని... ఇప్పుడక్కడ వెలుగుపరుచుకుని యున్నది’-జెనెసిస్ I 3 -దిహోలీ బైబిల్ మీ

Published: Sun,August 11, 2013 12:20 AM

ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలు

Published: Sun,May 12, 2013 12:08 AM

పరిమితము.. విస్తృతమూ...

నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధ

Published: Sun,May 27, 2012 12:11 AM

మానుకోట రాయికి వందనం

దిడ్డి వెంక కుడికాలు తొడకు బుల్లెట్ గాయం ఉంది. అది మానిన గాయం. కానీ సలుపుతూ ఉంటుంది. అవమానంలాగా. స్వాభిమానం మీద ఆధిపత్యం ఆక్రమణ ప్

Published: Wed,March 14, 2012 12:40 AM

సాహు జ్ఞాపకం

పటార్ నేల మీద నిలబడి ఆత్రం సక్కుబాయి నెత్తటిలో తడిసిన పగిలిన కుండపెంకుల్లో కన్నీళ్ళొడిపిన వాడు సాహు. శనిగరం వెంక రోతగానూ, గీపెడ్

Published: Sun,March 4, 2012 12:15 AM

విధ్వంసమూ.. వర్తమానమూ...

తెలంగాణము చల్లారని నీటి అగ్గి దేవతలను దయ్యాలను చేస్తుంది బుగ్గి పో పొండోయ్ పాలకులారా.. 17-02-1972 న తెలంగాణ ప్రజాసమితి కరపవూతంలో

Published: Sun,February 26, 2012 12:09 AM

అసెంబ్లీ..జ్ఞానము.పజాస్వామ్యము

అసెంబ్లీ కార్యకలాపాలు చూడడం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అంటుంటారు కానీ.. అప్పుడప్పుడు జ్ఞానం కూడా ఆయాచితంగా లభిస్తుందని చాలామ

Published: Sat,January 7, 2012 11:49 PM

పాలకుర్తి పలవరింత

సంస్కృతి అంటే సరిపడని వారు భూప్రపంచం మీద చాలా మంది ఉంటారు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం అనే మాట లు వాటి కి సంబంధించిన ‘ఇజా’లు

Published: Sat,December 31, 2011 11:33 PM

పసిడి రెక్కలు విసిరి కాలం...

బతుకంటే ‘విత్ ఆల్ ద హెల్’ ఒక నిప్పు కణిక కదా.. బతుకంటే ఒక విశ్వా సం కదా. బతుకంటే బతకడం కదా.. బతుకంటే అగాథమౌ జల నిధి నుంచి ఆణిముత్

Published: Sun,December 4, 2011 12:33 AM

కోటి బంధం

పెద్దపల్లి జెండా గద్దె.. అటునుంచి కోటి ఇంటివేపు... ఊరేగింపు నడుస్తు న్నది. ఐటిఐ హాస్టల్ రూములు. కోటి ముప్ఫై నాలుగేండ్ల క్రిందట ఆ గ

Published: Sun,November 20, 2011 12:37 AM

తెలంగాణ పోరు సాగుతుంది...

ఉద్యమం చల్లబడింది. ఇక తెలంగాణ రాదేమొ. అంతపెద్ద ఉద్యమం చేస్తేనే ఇవ్వలేదు. మళ్లా అంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తదా? ఇక దేనికి తెలంగాణ ఇ

Published: Sun,October 23, 2011 12:51 AM

నమస్తే తెలంగాణ జోలికి రాకండి

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లక

Published: Sat,September 24, 2011 10:32 PM

ద్రోహులకు చావు డప్పు

‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూని

Published: Sun,September 11, 2011 12:02 AM

తెలంగాణ బడబానలం

సల్లవడ్డదా! తెలంగాణ. కొంచెం స్తబ్దుగున్నదా? సాగిపోతున్నదా? నిజమే నా? ఇది. ఒక దిక్కు సకలజనులు సమ్మెకు తయారౌతున్న సందర్భం. సకల జనుల

Published: Mon,July 25, 2011 12:10 PM

కులము-ప్రాంతము-కన్నీరు

ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన,ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాట