ఏది సమాఖ్య స్ఫూర్తి?


Fri,February 7, 2014 01:08 AM

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి బదులు సీమాంధ్ర పెత్తందారులు అసెంబ్లీ ఆమోదం లేకుండా రాష్ర్టాన్ని విభజించడం సమాఖ్య విధానానికి విరుద్ధమనే అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన సమాఖ్య వ్యవస్థ సమగ్రతను, సమైక్యతను దెబ్బతీస్తుందనే విచిత్రమైన మాట మాట్లాడాడు. చంద్రబాబు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమానమే అని సూత్రీకరించాడు.

నదీ జలాల విషయమై పశ్చిమ బెంగాల్ అభ్యంతరం చెప్పడం వల్ల మన దేశం బంగ్లాదేశ్‌తో ఒప్పందం కుదుర్చు కోలేదని, తమిళనాడు అభ్యంతరం చెప్పడం వల్ల ప్రధాని శ్రీలంక పర్యటన రద్దు చేసుకున్నారనీ, అందువల్ల మనది సమాఖ్య అని ఈ పెద్ద మనిషి చెబుతున్నాడు. ఇతర దేశాలతో వ్యవహరించే క్రమంలో స్థానిక ప్రజల మనోభావాలు పట్టించుకోవడం ప్రజాస్వామిక లక్షణం. అంత మాత్రాన దానిని సమాఖ్య లక్షణంగా చెప్పడం అవగాహనా రాహిత్యమే.
సమాఖ్య విధానం అంటే ఆయా
ప్రాంతాలలోని జాతుల స్వీయ పాలనను,
స్వేచ్ఛాకాముకతను పెంపొందించేది
అయి ఉండాలే తప్ప, రాజకీయపార్టీల
ముసుగులో ఉన్న ప్రాంతీయ ఆధిపత్య
వర్గాలకు ప్రజలను చావగొట్టి చెవులు మూసే పెత్తనం ఇచ్చేదిగా ఉండకూడదు. సీమాంధ్ర పెత్తందారులకు నొప్పిలేచినప్పుడల్లా
దానిని సమాఖ్య విధానానికి దెబ్బగా
భావించాలంటే ఎవరూ ఆమోదించరు.


కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య అధికారాల పంపిణీ ఎంత మేర ఉండాలనే కచ్చితమైన నిర్దేశం ఏ దేశంలో కూడా ఉండదు. చారిత్రక, సామాజిక, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ అధికారాల బదలాయింపులో తేడాలు ఉంటాయి. కొందరు మేధావులుగా చెప్పుకుంటున్నవారు సమాఖ్య అనగానే ఏకంగా అమెరికా విధానాన్ని ప్రస్తావిస్తున్నారు. అమెరికాలో కాలానుగుణంగా రాష్ర్టాల అధికారాలకు కత్తెర పడుతూ వచ్చిందని వీరికి తెలిసినట్టు లేదు. అమెరికా ఒక దేశంగా ఏర్పడడానికి ముందు బ్రిటిష్ వలస ప్రాంతాలుగా ఉండేది. ఈ వలస ప్రాంతాలు కలిసి మొదట రాష్ర్టాల కూటమి (కాన్ఫెడరేషన్)గా ఏర్పడ్డాయి. దీనిని ఒక రాజ్యంగా రూపుదిద్దడం కోసం మాడిసన్ వంటి రాజనీతిజ్ఞులు, నాయకులు ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. ఆ కాలంలో సమాఖ్య విధానం అంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండాలనే అర్థం ఉండేది. కేంద్రం బలంగా లేకపోవడం వల్ల పరిపాలన కష్టమైంది. దీంతో క్రమంగా కేంద్రం అధికారాలు పెంచుకుంటూ పోయారు.

ఇప్పటికీ అమెరికాలో రాష్ర్టాలకు విశేష అధికారాలు ఉన్నాయి. అయితే అవి చారిత్రకంగా విడి ప్రాంతాలు కలవడం వల్ల జరిగింది. సమాఖ్య సిద్ధాంతాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నారే తప్ప శిలాశాసనంగా వారు ఎప్పుడు భావించలేదు. ఇగ మన దేశంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత స్వదేశీ సంస్థానాల విలీనం, రాష్ర్టాల పునర్వ్యస్థీకరణ ప్రధానాంశంగా ముందు కు వచ్చింది. రాష్ర్టాలకు అధికారాలు ఉండాలే అంటే, మొదట రాజ్యంగా ఉండి ఆ తరువాత దేశంలో కలిసిన తెలంగాణ ప్రాంతానికి అటువంటి నైతిక అధికారం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ అస్తిత్వాన్ని పునరుద్ధరించక పోగా, రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ముల్కీ నిబంధనలను నిర్వీర్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య. అంతే తప్ప మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణపై పెత్తనం చేసే హక్కును సమాఖ్య సిద్ధాంతంగా గుర్తించకూడదు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ర్టాన్ని పునరుద్ధరించడమే సమాఖ్య స్ఫూర్తికి అనుగుణమైనది. రాజ్యాంగంలోని మూడవ అధికరణం ఆయా ప్రాంతాల స్వేచ్ఛకు పూచీ ఇచ్చేదే తప్ప రాష్ర్టాల హక్కులను హరించేది కాదు.


రాష్ర్టాల అధికారాలను కేంద్రం హరించాలని తెలంగాణ వారు చెప్పడం లేదు. సీమాంధ్ర నాయకులే హైదరాబాద్‌ను కేంద్రపాలితం చేయాలనే సూచనతో ఒక ప్రాంతం అధికారాలను తునుమాడాలని సూచిస్తున్నారు. కొద్దికాలం కిందట ఉగ్రవాద నిరోధన కోసమంటూ కేంద్రీయ గూఢచార వ్యవస్థను నెలకొల్పడం రాష్ర్టాల అధికారాలను కుదించడమనే విమర్శ ఉన్నది. తాజాగా మత హింస నిరోధం పేర రూపొందిన బిల్లు కూడా రాష్ర్టాల అధికారానికి దెబ్బ అనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలోని ఆర్థిక విధానాలు భారీ ఎత్తున రాష్ర్టాలు కేంద్రంపై ఆధారపడేలా ఉన్నాయి. కొన్నేండ్ల కిందట పంచాయతీరాజ్ చట్టం కూడా రాష్ర్టాల ప్రాధాన్యాన్ని తగ్గించే చర్య అనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆ వికేంద్రీకరణ విధానాన్ని వ్యతిరేకించే నైతిక సాహసం రాష్ర్టాలకు లేకపోయింది. ఇటువంటి చర్యలను సమాఖ్య సూత్రం వర్తింప చేసి పరిశీలించవచ్చు.

కొన్ని దశాబ్దాల కాలంలో ఒక్కో రాష్ట్రంలో ఒకటి లేదా రెండు ఆధిపత్యవర్గాలు వనరులు కొల్లగొట్టి బలిసిపోయాయి. ఈ ఆధిపత్యవర్గాలు తమ ప్రాంతంపై తమకు గుత్తాధిపత్యం ఉండాలని కోరుకుంటున్నాయి. సీమాంధ్రలోని రెండు ఆధిపత్య వర్గాలు చేస్తున్న వాదన ఇదే. సమాఖ్య విధానం అంటే ఆయా ప్రాంతాలలోని జాతుల స్వీయ పాలనను, స్వేచ్ఛాకాముకతను పెంపొందించేది అయి ఉండాలే తప్ప, రాజకీయ పార్టీల ముసుగులో ఉన్న ప్రాంతీయ ఆధిపత్యవర్గాలకు ప్రజలను చావగొట్టి చెవులు మూసే పెత్తనం ఇచ్చేదిగా ఉండకూడదు. సీమాంధ్ర పెత్తందారులకు నొప్పి లేచినప్పుడల్లా దానిని సమాఖ్య విధానానికి దెబ్బగా భావించాలంటే ఎవరూ ఆమోదించరు.

412

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

country oven

Featured Articles