బిల్లుకు విముక్తి ...


Thu,January 30, 2014 12:33 AM

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్ప గలిగారు. కానీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు, జగన్ పార్టీతో సహా ఎవరూ ఎందుకు కలిసి ఉండాలో? వివరించలేకపోయారు.

గురువారం తెలంగాణ బిల్లుకు అసెంబ్లీ నుంచి విముక్తి లభిస్తుంది. ఇది ఆశ, స్వీయ ఆకాంక్ష కాదు. పచ్చి నిజం. విముక్తి ఎందుకనాలంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల లిటిగెంట్ మనస్తత్వాలు, కాలుకేస్తే మెడకేసే తత్వాలు, అడ్డగోలు వాదనలు, ఈ భూ ప్రపంచం మీద ఎక్కడాలేని విధంగా పరస్పర వైరుధ్యపూరిత డిమాండ్లు, సష్టించిన చిల్లర ఆటంకాలు, బిల్లును చింపేసిన మెజారిటీ ప్రాంతపు అహంభావం, బిల్లును, తద్వారా తెలంగాణ సమాజాన్ని చిల్లంకల్లం చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ అధిగమించి బిల్లు ఢిల్లీకి వెళ్లే సుదినం గురువారమే. ఇందుకు ముందుగా తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ, పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఐక్యత ప్రదర్శించినందుకు తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈ బిల్లు అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా ఐక్యంగా ఉండేలా వారిపై ఒత్తిడి పెంచిన, ప్రయత్నించి అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేంత స్థాయిలో ఉద్యమం మంద్రస్థాయిలో కొనసాగించిన ఉద్యమ సమాజానికి కూడా అభినందనలు. అసెంబ్లీ లోపల ప్రజాప్రతినిధులు మాత్రమే చేయగలిగిన కార్యాలను వారు సమర్థంగా నిర్వహించినందున, బయట తలోదిక్కు చెల్లాచెదురు కాకుండా ప్రజాప్రతినిధులపై అనునిత్యం ఒక నిఘాలా వ్యవహరించిన చైతన్య సమాజం కారణంగా ఇది సాధ్యమయింది.

మదరాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, రాజాజీ చేత మాట అనిపించుకునేస్థాయిలో అప్పటి ఆంధ్ర నాయకులు వ్యవహరిస్తే, ఇప్పటి సీమాంధ్ర నాయకత్వం కూడా వారి వారసులుగా నిరూపించుకున్నారు. ఇందులో పార్టీల తేడా కానీ, ముగ్గురు బాబుల మధ్య తేడా కానీ పెద్దగా లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడనే లేదు. కానీ ఆయన రెండుకళ్ల సిద్ధాంతం ఇవ్వాళ్టికి కూడా అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కతమవుతూనే ఉన్నది. ఇది రాస్తున్న సమయానికి తెలుగు దేశం పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల బిల్లుపై తీర్మానం కోసం పట్టుబడుతూ ధర్నా చేస్తుంటే, బయట అసెంబ్లీ ముందర తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు తీర్మానం అక్కరలేదు, చర్చ ముగించి బిల్లు పంపెయ్యాలని ప్రదర్శన చేస్తున్నారు. చంద్రబాబు పార్టీకి ఇట్లా ఏ స్పష్టతా లేకుండానే ఆయన స్వయంగా ఎటు మొగ్గకుండానే బిల్లు వెళ్లిపోతుందన్నదే వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి రెండుకళ్ల సిద్ధాంతం పేరుమాత్రమే లేదు కానీ, ఆ పార్టీ ఆయా ప్రాంతాల వారీగానే విడిపోయింది. అక్కడివారు అక్కడి పాట, ఇక్కడి వారు ఇక్కడి మాటగా ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించేశారు. ఇక జగన్ పార్టీ మాత్రం తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న మరు నిమిషమే, ఇక ఇక్కడ భవిష్యత్తు లేదని సీమాంధ్ర ప్రాంతంలో సీట్ల వేటలో పడింది. అది కొంత నయం.

జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణి, ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం రెండుకళ్ల సిద్ధాంతం, జగన్ ఒంటికన్ను గురి ఏదైనా అసెంబ్లీలో ఈ ముగ్గురు బాబులు తోడు, లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్ ఎవరెన్ని కబుర్లు చెప్పినా అసెంబ్లీలో బిల్లును అడ్డుకునేందుకు, ఆటంకాలు కల్పించేందుకు రాజ్యాంగస్ఫూర్తిని, ప్రజాస్వామ్యస్ఫూర్తిని అభాసుపాలు చేసి, అడ్డదిడ్డంగా మాట్లాడి తమ తమ ప్రతిష్టలను దిగజార్చుకున్నారు తప్ప సాధించింది శూన్యం. ఆర్టికల్ 3, గత అనుభవాలు, రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణకు అనుసరించే రాజ్యాంగపద్ధతులు, సంప్రదాయాలు అన్నీ కూడా ఈ పెద్దమనుషుల చేతిలో అపహాస్యం పాలయ్యాయి. బిల్లు చెల్లనే చెల్లదని తిరస్కరించాలని నోటీసులు ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తెల్లవారే తద్విరుద్ధంగా బిల్లు గడువు పెంచాలని కోరడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి... ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం తప్ప, చెల్లుబాటు అవుతుందనుకుని, అన్ని రకాల సూత్రాలనూ ఉల్లంఘించి మాట్లాడడమే తప్ప దీంట్లో వెతకాల్సిన నిగూఢ అంశాలేమీ లేవు.

మెజారిటీ నుంచి రక్షణ కోసం అంబేద్కర్ మైనారిటీ ప్రజల ఆకాంక్షలను కాపాడడానికే ఆర్టికల్ 3 ని అనేక రాజ్యాంగసభ చర్చల తర్వాత పకడ్బందీగా రూపొందించారు. క్యాబినెట్ నిర్ణయం, జీవోఎం ఏర్పాటు, రాష్ట్రపతి బిల్లు పంపించడం, చివరికి అసెంబ్లీకి చేరడం అనే ప్రక్రియ సాధారణమైంది ఏమీకాదు. ఈ విషయం సీమాంధ్ర నాయకులకు తెలియదని అనలేము. కానీ బిల్లు అసెంబ్లీకి వచ్చినది మొదలు బిల్లు చింపడం, యాగీ చెయ్యడం, ముఖ్యమంత్రి స్వయంగా అభ్యంతరాలు చెప్పడం, గడువు కోరడం, అయినా బిల్లు గురువారం ఢిల్లీకి వెళ్లడం ఖాయంగా మారడం ఈ నలభై తొమ్మిది రోజుల గందరగోళం తెలంగాణ ప్రజలను ఊపిరితీసుకోనివ్వకుండా చేసింది. నిజమే ఈ బిల్లు పవిత్రమైనది. అది అమరవీరుల త్యాగాల నెత్తురంటిన బిల్లు. ఆత్మకు దగ్గరైన బిల్లు. ఆకాంక్షల బిల్లు. అందువల్ల గురువారంతో ఈ ఆందోళన తొలగిపోతుందన్నదే వాస్తవం.
ఈ మొత్తం క్రమంలో సీమాంధ్ర ప్రజలు ప్రేక్షకులయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్పగలిగారు. కానీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు, జగన్ పార్టీతో సహా ఎవరూ ఎందుకు కలిసి ఉండాలో? వివరించలేకపోయారు. విడిపోతే నిజంగానే ఏమవుతుందో? చెప్పలేకపోయారు. ఈ మొత్తం క్రమంలో ఇలాంటి నాయకత్వం ఉన్నందుకు సీమాంధ్ర ప్రజల కు గంపగుత్తగా సానుభూతి ప్రకటించడం తప్ప మరేమి చెయ్యగలం.

253

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...