రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి


Wed,January 29, 2014 02:24 AM

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి
కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మానం
ప్రవేశపెట్టిన వారి అసలు భావనలను ఉద్దేశాలను పరిగణించాల్సి ఉంటుంది. అది సత్సంప్రదాయం అవుతుంది.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భారత రాష్ట్రపతి పంపిన బిల్లుపై బహుముఖ యుద్ధానికి బహిరంగంగా తలపడ్డాడు. కేంద్ర క్యాబినెట్ రూపొందించి, రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వచ్చిన బిల్లు సాంకేతికంగా అసెంబ్లీ పరిధి బిల్లు కాదు. ఆర్టికల్ 3 ప్రకారంగా పంపిన బిల్లుపై అభిప్రాయాలు కోరడానికి వచ్చిన బిల్లు ఏరకంగా చూసినా ప్రత్యేకమయింది.

సాధారణంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుకు వర్తించే నియమ నిబంధనలు, సంప్రదాయాలు రాష్ట్రపతి పంపిన బిల్లుకు వర్తించే అవకాశమే లేదు. దరిదాపు నలభై ఏడు రోజుల క్రితం ఈ బిల్లు పంపుతూ పాత సంప్రదాయాలను అనుసరించి రాష్ట్రపతి బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే కోరారు. నాలుగు రోజుల గొడవ తర్వాత 16డిసెంబర్‌న చర్చ ప్రారంభమయింది. ఇదీ వివాదం అయింది. కానీ ఆనాడు స్పీకర్ బిల్లు చర్చ ప్రారంభమయిందని ప్రకటించినప్పుడు ఇది ప్రత్యేక బిల్లు అని సాధారణ అసెంబ్లీ నియమ నిబంధనల పరిధిలోకి రాదని కూడా విస్పష్టంగా ప్రకటించారు. అభిప్రాయాలు అనే మాటకు విస్తతార్థం కల్పించినా, ఈ అవకాశంతో బిల్లుకు సవరణలు, అభ్యంతరాలు ప్రతిపాదించినా వాటిపైన సభ్యులు మాట్లాడే, చర్చ చేసేందుకు వీలుంది. చివరగా సభ్యుల అభిప్రాయాలు అంటే చర్చ సందర్భంగా వచ్చిన అన్ని విషయాలను క్రోడీకరించి పంపుతారు. స్థూలంగా అదే శాసనసభ అభిప్రాయంగా పరిగణించి, మళ్లీ బిల్లు కేంద్ర మంత్రి మండలి పరిధికి వెళ్తుంది. కేంద్ర క్యాబినెట్ అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, జీవోఎం ఏర్పాటు అయి వున్నందున వారి పరిశీలన తర్వాత మార్పులు, చేర్పులతో, న్యాయశాఖ సలహాలతో పార్లమెంటుకు వెళ్లడం సాధారణంగా ప్రక్రియ.

కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి వల్ల బిల్లుకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పర్చడం, ముందుగా అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టనివ్వకుండా గొడవ, ఆ తర్వాత చర్చ ప్రారంభం అయిన తర్వాత కాలేదన్న వివాదాన్ని లేవనెత్తడం, ఆ తర్వాత గడువు కోరడం, ఆగడువు కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల షెడ్యూల్‌ను మనసులో పెట్టుకొని, నిజంగానే చర్చ అవసరాల కోసం కాకుండా, బిల్లుకు కాలవ్యవధి సమస్య వచ్చేట్టు కుట్ర చేసి రాష్ట్రపతికి రెండు నెలల గడువు కావాలని కోరడం ఇవన్నీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎత్తుగడలు. ఆ తర్వాత అసెంబ్లీలో గొడవ మధ్య బిల్లు చర్చకు సహకరించారన్న కక్షతో ఏకంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును తొలగించి, సీమాంధ్ర మంత్రి శైలజనాథ్‌ను ఏకపక్షంగా నియమించుకోవడం కూడా ఇందులో భాగమే. అదీ గడిచిన తర్వాత సభలో చర్చ జరిగి అక్షరాల 86 మంది సభ్యులు మాట్లాడిన తర్వాత రాత పూర్వకంగా దరిదాపు 9024 సవరణలు, ప్రతిపాదనలు అందిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి మరో కుట్రకు తెరలేపారు. అదే రూల్ 7హకింద బిల్లును తిరస్కరించాలన్న నోటీసులు. ముసాయిదా బిల్లా? అసలు బిల్లా? అన్న అనవసర చర్చ లేపి, బిల్లు తప్పుల తడక గా ఉందని, ఈ బిల్లుపై అభిప్రాయాలు చెప్పలేమని, తిరస్కరించాలని సీఎం నోటీసులు ఇచ్చారు. ఇక్కడ విచిత్రమేమంటే, దరిదాపు ఆరు గంటల పాటు ఇదే బిల్లుపై అభిప్రాయాలు చెప్పిన ముఖ్యమంత్రి చివరికి ఈ ఎత్తుగడ వేయడంలోని ఆయన కుట్రపూరిత బుద్ధి బయటపడింది.

బిల్లులో ఉన్న మంచి చెడ్డలు చర్చించడానికి గానీ, నిజంగానే ఈ బిల్లులో ఉన్న అవకతవకల వల్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్న సదుద్దేశ్యంతో కానీ ముఖ్యమంత్రి ఈ పనులన్నీ చేస్తే ఆయనను ఎవరూ శంకించే వాళ్లు కాదు. కానీ రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిన మొదటి రోజు నుంచి, రూల్ 77 క్రింద నోటీసులిచ్చిన దాకా ఆయన బిల్లుకు ఎట్లాగైనా ఆటంకం కలిగించి, పార్లమెంటు సమావేశాలు ముగించేదాకా ఆపగలిగితే ఇక విభజన జరగదన్న కుట్రపూరిత ధోరణి తప్ప ఆయన ఆలోచనలో, కార్యాల్లో మరేదీ కనబడడం లేదు. అందుకే కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి,ఆయన వ్యక్తిగత ఏకపక్ష ధోరణి,రాజ్యాంగ సూత్రాలను కూడా ధిక్కరిస్తున్న తీరు, రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును కూడా శంకిస్తూ వ్యవస్థలపై విశ్వాసాలకు విఘాతం కల్పించడం అన్నీ ఇవ్వాళ చర్చకు వస్తున్నాయి. అంతేకాకుండా మంత్రులు, శాసనసభ్యులతో సహా సభ మొత్తం నిట్టనిలువునా చీలిపోయి ఉన్న ఈ వాతావరణంలో ఆయన ఏకపక్షంగా, ఆధిపత్య ధోరణిలో వ్యవహరిస్తూ, శాసనసభ విలువలను కూడా కాలరాస్తున్నారు.


ఒకవేపు రూల్ 7హకింద ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసుల వల్ల అసెంబ్లీలో చర్చ ఏమాత్రం జరగని గందరగోళం నెలకొన్నది. మరోవేపు మరో రెండు రోజులు మాత్రమే రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఉన్నది. ఇదే సందుగా ముఖ్యమంత్రి మరోసారి గడువు పెంచాలని ఏకపక్షంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. శాసనసభ అభిప్రాయాల క్రోడీకరణ ఇప్పుడు అసెంబ్లీ ముందున్న తదుపరి లక్ష్యం. మరోవేపు అభిప్రాయాలు, అభ్యంతరాలను కూడా విధి విధానాల ప్రకారంగా పంపించాలి. ఈ సమయంలోనే బిల్లు ప్రక్రియ ఏమాత్రం ముందుకుపోకుండా నిలబడి ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీర్మానంపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు.

విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మానం ప్రవేశపెట్టిన వారి అసలు భావనలను ఉద్దేశాలను పరిగణించాల్సి ఉంటుంది. అది సత్సంప్రదాయం అవుతుంది. బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ, రాజ్యాంగాన్నే అపహాస్యం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి దురుద్దేశాలను అర్థం చేసుకుని తీర్మానాన్ని తిరస్కరించి, అసెంబ్లీలో జరగాల్సిన మిగతా ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసి పంపితేనే స్పీకర్ స్వతంత్రత, ప్రతిపత్తి, విజ్ఞత నిరూపణ అవుతుంది. ఆ విధంగా రాజ్యాంగస్ఫూర్తి నిలబడుతుంది. కాదంటే ప్రజలు ఎవరి పరిధిలో వారు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అది ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలకు ఏమంత మంచిది కాదు.

329

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

Featured Articles