ఐక్యత అపూర్వం


Tue,January 28, 2014 02:24 AM

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన్న ఒక అవగాహనను నేర్పింది.

సోమవారం నాడు అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించిన ఒక అపురూప దశ్యం ఆవిష్కతమయింది. ఇన్నాళ్లూ రగిలి రగిలి, పొగిలి పొగిలి, అధిష్ఠానానికి, సీమాంధ్ర ఆధిపత్య అధికార చిహ్నమైన ముఖ్యమంత్రికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చిన తెలంగాణమంత్రులు తిరుగుబావుటా ఎగరేసి పోడియం వద్దకు వెళ్లారు. అధికారంలో ఉన్న మంత్రులే తమ సభా నాయకుడిని ధిక్కరించి, ఆయన సభలో ఉండగానే పోడియం దాకా వెళ్లడం మొదటిసారి కావొచ్చు. కేవలం పోడియం వద్దకు వెళ్లడమే కాదు. స్వయంగా తమ సభా నాయకుడికి వ్యతిరేకంగా సీఎం డౌన్‌డౌన్ అని నినాదాలు చేశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ చుట్టూ వలయంగా ఏర్పడి, ఇంకా ఈ ఆధితప్యం ఇక చెల్లదు అన్న సందేశం ఇచ్చారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా జరిగే ఏ తతంగాన్నీ, సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగే ఏ కార్యకలాపాన్నీ అనుమతించబోమని కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ జై తెలంగాణ, సీఎం డౌన్‌డౌన్ నినాదాలతో దద్దరిల్లింది. ఇది తెలంగాణ ఉద్యమం సాధించిన ఒక గుణాత్మక పరిణామంగా భావించవలసి ఉంటుంది. ఎంత అణగిమణిగి ఉన్నా,

కనపడని కట్టడుల మధ్య, నలిగిన వారు అయినా అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఆధిపత్యంతో చివరికి తలపడక తప్పదన్న భావనకు రావడమే ఇవ్వాల్టి విశేషం. తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న అంతిమ కుట్రలు నగ్నంగా బయటపడడం కూడా తెలంగాణ మంత్రులకు ఇక తప్పదు తెలంగాణ కోసం నిలబడాలి అని పురికొల్పిన అంశం కూడా అయి వుండవచ్చు. రాష్ట్రపతి నుంచి బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత బిల్లును ప్రవేశపెట్టకుండా సీమాంధ్ర ప్రతినిధులు యాగీ చేసినప్పుడు కూడా తెలంగాణ వారి ఐక్యతా ప్రదర్శనను చూసి ఉన్నది తెలంగాణ. బిల్లుపై చర్చ ప్రారంభమయిందని డిప్యూటీ స్పీకర్ ఆనాడు ప్రకటించగానే స్వయంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సభా వ్యవహారాల మంత్రిగా అప్పుడు ఉన్న శ్రీధర్‌బాబులు తమ స్థానాల్లో లేచినిలబడి హర్షాతిరేకంతో చేతులెత్తిన దశ్యం అరుదైనదే. అలాగే ఇవ్వాళ కూడా ఒకవేపు తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ మంత్రులతో సహా పోడియం చుట్టూ చేరి జై తెలంగాణ నినాదాలు చేస్తున్నప్పుడు, పోడియంలో మంత్రులు నిలబడి స్వయంగా తమ ప్రభుత్వాధినేత కుట్రపూరిత వ్యవహారాలపై నినాదాలు చేస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన స్థానంలో లేచి నిలబడి మంత్రులను ప్రోత్సహించడం కూడా అరుదైన దశ్యమే. సన్నివేశమే. ఇది పూర్తి గా సభలో ప్రజాప్రతినిధుల మధ్య, ప్రభుత్వంలోని ఇరు ప్రాంతాల మంత్రుల మధ్య ఏర్పడిన సంపూర్ణ విభజనకు చిహ్నం. ఇక ఏ శక్తీ ఆంధ్రప్రదేశ్‌ను విడిపోకుండా కాపాడలేదన్న నగ్నసత్యం అసెంబ్లీలో ఆవిష్కతమయ్యింది.

సభా నియమం 77 ప్రకారంగా బిల్లును తిరస్కరించాలని స్పీకర్‌కు వినతి చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకపక్ష, నిరంకుశ పోకడ బట్టబయలయింది. కేంద్రమంత్రి, జీవోఎంలో ఒక మంత్రివర్గ సభ్యుడు అయిన జైరాం రమేశ్ కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యాంగ భాషణలపై, సాంకేతిక అంశాల ఆధారంగా లేవనెత్తిన సాంకేతిక కిరికిరిని నిర్దంద్వంగా తిరస్కరించారు. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ అధికారం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటు పరిధిలోనిదేనని, అభిప్రాయాలు చెప్పమంటే,రాజ్యాంగం చాలా తెలిసినవాళ్లలా? ఇదేమి ఉల్లంఘన అని వివరంగా మాట్లాడారు. తన మంత్రివర్గ సహచరులకు మాటమాత్రం చెప్పకుండా, క్యాబినెట్ నాయకుడిగా అందరి అభిప్రాయాలకు బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి, పూర్తి ఏకపక్షంగా స్పీకర్‌కు వినతి ఇచ్చిన ముఖ్యమంత్రి జైరాంరమేశ్ వ్యక్తిగతంగా మాట్లాడారా? కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడారా? అని అడగడంలో ఔచిత్యం ఆయనకే తెలియాల్సి ఉన్నది. మంకుపట్టు, తమకు తెలిసిందే రాజ్యాంగం అనుకునే వారి కోవలో వ్యవహరిస్తే ఎల్లకాలం చెల్లదు. ఎక్కడో ఒక దగ్గర ఎదురుదెబ్బ తప్పదు. సరిగ్గా అసెంబ్లీలో ఇవ్వాళ ముఖ్యమంత్రికి అదే అనుభవం ఎదురయింది. మంత్రిమండలి సహచరులే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి డౌన్‌డౌన్ అనే నినాదాలు చేసే స్థాయి ఏర్పడిందంటే అందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఒంటెత్తు పోకడలు, నిరంకుశ వ్యవహారాలే కారణం తప్ప తెలంగాణ మంత్రులది కాదు. బహుశా ఏ ముఖ్యమంత్రికీ ఇలాంటి చేదు అనుభవం ఇది వరకు ఎదురై ఉండలేదేమో. విభజన బిల్లు పుణ్యాన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల అసలు స్వభావాలు, స్వరూపాలు, కుట్రలు, కుతంత్రాలు, అప్రజాస్వామిక ధోరణులు, మొండితనం, అహంకారం, ఆధిపత్యం అన్నీ కలగలిసిన, పోతపోసిన నాయకులుగా రూపుకట్టినందువల్లే ఈ తిరుగుబాటు అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యం గా లేకపోతే బలయిపోతామన్న ఒక అవగాహనను నేర్పింది. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఒక ప్రైవేటు హోటల్‌లో తెలంగాణ ప్రజాప్రతినిధులందరినీ కూచోబెట్టి ఐక్యతా ప్రయత్నాలు చేసి, ఒక మధ్యవర్తిగా రాజకీయ ఐక్యతను సూచించిన అనంతర పరిణామాల్లో, ఒకరిని, ఒకరు తిట్టుకున్నా, రాజకీయ ప్రయోజనాల కోసం మాటల తూటాలు పేల్చుకున్నా, అంతిమ సందర్భంలో రెండుసార్లు, ఒకటి బిల్లు చర్చ ప్రారంభించడంలో, ఇవ్వా ళ ముఖ్యమంత్రి నిరంకుశ పద్ధతులను ప్రతిఘటించడంలో అపూర్వ ఐక్యత ప్రదర్శించారు. తెలంగాణ సమాజం తరఫున తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ ఉద్యమాభివందనాలు. బిల్లు ఢిల్లీకి వెళ్లేదాకా ఈ ఐక్యతను ప్రాణపదిలంగా కాపాడుకోవాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది.

335

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

Featured Articles