అణచివేతలు..అనుమతులు


Wed,January 22, 2014 12:36 AM

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా
రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వడాన్ని ఏమంటారు! సోమవారంనాడే ఎపీఎన్జీవోల ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసు అధికారులు ప్రకటించారు. నిషేధాజ్ఞలు ఉన్నాయని చెప్పారు. ఇంతలోకే ఈ అనుమతి దేనికి సూచన! ఎవరిని రెచ్చగొట్టడానికి ఏ ప్రక్రియను విఫలం చేయడానికి ఈ అనుమతులు ఇచ్చినట్టు!

సరిగ్గా మంగళవారం నాడే విగ్రహ విధ్వంసం మీద అసెంబ్లీలో వాదోపవాదాలు జరిగాయి. సాయంత్రానికల్లా ఏపీఎన్జీవోల చలో హైదరాబాద్‌కు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు.తెలంగాణ బిల్లుపై చర్చలో టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు కేటీఆర్ మట్టిబొమ్మలను కూల్చితే లబలబలాడిన వాళ్లు, జీవమున్న మనుషులు ఉద్యమంలో ఆత్మార్పణ చేసుకుంటే కనీస సంతాప తీర్మానం చెయ్యలేదు అన్నందుకు సీమాంధ్ర శాసనసభ్యులు సాకునాలు, తీకునాలు తీసి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. గురజాడ లాంటి మహానుభావుని మాటలను ప్రసంగంలో వాడుకున్న వాళ్లే, ఆయన విగ్రహ విధ్వంసం చేశారని సీమాంధ్ర శాసనసభ్యుడు ఒకరు అంటే ఈటెల రాజేందర్ దీటైన జవాబు చెప్పారు. ఇంతకీ ఈ విగ్రహ విధ్వంసం తెలంగాణ మిలియన్‌మార్చ్‌కు అనుమతి ఇవ్వక, తీవ్ర నిర్బంధం ప్రయోగించి, ఎక్కడికక్కడ కట్టడి చేసినందువల్ల, ఆ ఆక్రోశంలో ట్యాంక్‌బండ్ మీది విగ్రహాలు కూలాయని ఈటెల చెప్పారు. నిజమే.

కలిసి ఉందామని బలవంతపు ఏకపక్ష ప్రేమను ప్రదర్శిస్తున్న వాళ్లు, కౌన్సిల్‌లో అయితే ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్లు తమ ఆధిపత్యాన్ని భావజాలపరంగా స్థాపించుకున్నారు. దీన్ని అడిగిన ప్రతిసారీ, ప్రశ్నించిన ప్రతిసారీ, ఉద్యమించిన ప్రతిసారీ అణచివేతను ప్రయోగించారు. మాటలతో పనులయినంత కాలం, సజావుగా తమ ఆధిపత్యం చెలామణి అయి, వలస దోపిడీ నిరాటంకంగా కొనసాగినంత కాలం సీమాంధ్ర పెత్తందారులు, వారి కనుసన్నల్లో ఉండే ప్రభుత్వాలు శాంతిగానే కుట్రలు చేశారు. మార్మికంగా తెలంగాణ ప్రాంతాన్ని గుప్పిట్లోకి తెచ్చుకొని, ద్వితీయశ్రేణి పౌరులుగా దిగజార్చారు. కానీ తెలంగాణ, ఈ ఆధిపత్యాన్ని బద్దలుకొడుతూ ఉద్యమించిన ప్రతి సందర్భంలోనూ తీవ్ర అణచివేతను ప్రయోగించారు. తొలి తెలంగాణ పోరాటంలో 369 మందిని తుపాకి గుళ్లకు బలిచేశారు. మలి తెలంగాణ ఉద్యమం శాంతిగా నడుస్తున్నందున తీవ్ర భంగపాటుకు గురిచేసి వేయిమందికి పైబడిన బలిదానాలకు కారకులయ్యారు. ఇదొక విధానం. ఇదొక వలస ఆధిపత్య వ్యవస్థాపిత పద్ధతి.

మలి తెలంగాణ ఉద్యమం కీలకమైన ఎత్తుగడలు పన్నింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగస్ఫూర్తితో సూత్రబద్ధంగా శాంతియుత పోరాటాలు, ఒత్తిడి సాధించే రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధన అనే ఈ ఉద్యమ పంథా సరిగ్గా ఈ విగ్రహ విధ్వంసం రోజే కొంత సమరశీలత ప్రదర్శించింది. అందుకు కారణం సుస్పష్టమే. మిలియన్‌మార్చ్‌కు అనుమతివ్వకపోవడం, తీవ్ర ఆటంకాలు కల్పించి, హైదరాబాద్‌కు ఎవరినీ రానివ్వకుండా కట్టడి చెయ్యడం, ట్యాంక్‌బండ్ మీద అడుగుపెట్టనివ్వకపోవడం లాంటివి తెలంగాణ ఉద్యమకారుల్లో పట్టుదలను పెంచాయి. బారికేడ్లను బద్దలుకొట్టిన ఆ ఉత్సాహ, ఉద్వేగ, ఉద్రేకాలే ఆ తర్వా త పరిణామాలకు, విగ్రహ విధ్వంసానికి దారి తీశాయి. అణచివేత ప్రతిఘటనను రెచ్చగొడ్తుందన్న సూక్తి నిజమైంది.

ఇదంతా గడిచి, ఇవ్వాళ తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్నది. బుధవారం నాడు ఏపీఎన్జీవోల చలో హైదరాబాద్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ మలి ఉద్యమం నడిచిన పదహారు సంవత్సరాల కాలంలో బెల్లిలలిత ముక్కలయింది. పాటను ముక్క లు ముక్కలుగా నరికారు. కనకాచారిని హత్య చేశారు. నల్ల వసంత్, సుదర్శన్‌లు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఒక్క ప్రదర్శనకూ హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వలేదు. మిలియన్‌మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ దేనికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మున్నూ టా అరవై ఐదు రోజులూ ఉస్మానియా క్యాంపస్ ముళ్ల కంచెల చక్రబంధంలోనే ఇప్పటికీ నిర్బంధం నీడన బతుకుతున్నది. ఇప్పటికీ ఎన్‌సీసీ గేటు దాటకముందే బాష్పవాయు తూటాలకు విద్యార్థులు నెత్తురోడుతూనే ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి మీద వందల కేసులు, అనేకసార్లు జైలు ప్రాప్తి, బెయిళ్ల కోసమే ఖర్చయిన లక్షలాది రూపాయలు. కదిలితే, మెదిలితే నిర్బంధం మధ్య తెలంగాణ కేవలం

ప్రజాస్వామ్యస్ఫూర్తితో పోరాడింది. కానీ ఎన్నడూ ఈ ప్రభుత్వం దేన్నీ సహించలేదు. కలిసి ఉందామని, హైదరాబాద్ మాదే అని కన్నీళ్లు ఒకవేపు పెట్టుకొని, సూక్తిముక్తావళి వినిపించే ఇదే సీమాంధ్ర ప్రభువులు, ఫతేమైదాన్‌లో ఏపీఎన్జీవోల సభను నడవనిచ్చి, ఉల్టా తెలంగాణ బిడ్డలపై దాడులకు కారకులయ్యారు. ఇదే ఏపీ ఎన్జీవోలు అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించినా ఇప్పుడు చలో హైదరాబాద్ అంటే అనుమతించారు. తెలంగాణ ఏ ప్రదర్శనా కోర్టు జోక్యం లేకుండా వీలుకాలేదు. చివరకు ఆర్ట్స్‌కాలేజీ ముందర విద్యార్థి గర్జన సభ కూడా కోర్టు అనుమతితో జరిపించుకోవాల్సి వచ్చింది. విద్యార్థులు,తెలంగాణ ఉద్యమం, జేఏసీ ఐక్యంగా ఏ కార్యక్రమం చేపట్టినా తీవ్ర నిర్బంధం ప్రయోగించి, ఆ ప్రదర్శనలకు ముందే తీవ్ర హెచ్చరికలు చేసి, హైదరాబాద్‌ను దిగ్బంధం చేసే సీమాంధ్రులు, ఏపీఎన్జీవోల ఫతేమైదాన్ సభకు, జగన్ రాజకీయ సభకు, రాచమర్యాదలు కల్పించారు.

ఒకవేపు బిల్లుపై చర్చ జరుగుతుండగా, మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తేలుతుండగా రెచ్చగొడ్తూ ఏపీఎన్జీవోలు మాట్లాడుతుండగా చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వడాన్ని ఏమంటారు! సోమవారంనాడే ఎపీఎన్జీవోల ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసు అధికారులు ప్రకటించారు. నిషేధాజ్ఞలు ఉన్నాయని చెప్పారు. ఇంతలోకే ఈ అనుమతి దేనికి సూచన! ఎవరిని రెచ్చగొట్టడానికి ఏ ప్రక్రియను విఫలం చేయడానికి ఈ అనుమతులు ఇచ్చినట్టు! మరో దుష్టాంతం, చరిత్ర, మన్నూ, మషానం ఎందుకు? ఇది సీమాంధ్ర ఆధిపత్యానికి, పెత్తనానికి, మా ఇష్టం మా రాజ్యం, ఇది మేము ఏమైనా చేసుకుంటం అనే అహంకారానికి ఇంతకంటే నిదర్శనం అవసరమా! విగ్రహ విధ్వంసం ఎందుకు జరిగిందో? ఇప్పటికైనా ఏలికలకు అర్థమవుతుందా?

270

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

Featured Articles