గుండె చప్పుడు


Sat,January 11, 2014 02:36 AM

విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిలబడడానికి యత్నించాలె. తమ మైండ్ సెట్ మార్చుకోవాలే తప్ప బిల్లు ముసాయిదాలో లోపాలు ఉన్నాయనీ, తమకు అన్యాయం జరుగుతున్నదని మొత్తుకోవడం వల్ల ఫలితం ఉండదు.

అసెంబ్లీలో బిల్లు ముసాయిదాపై చర్చ సందర్భంగా తెలంగాణ ప్రజానాయకులు వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం. సమయాభావం వల్ల, కొందరి చెడగొట్టు బుద్ధుల వల్ల అభివూపాయ వ్యక్తీకరణ సాధ్యం కాదేమోననే అనుమానాలు బలపడిన నేపథ్యంలో తెలంగాణ శాసన సభ్యులు తమ అభివూపాయాలను, ప్రతిపాదనలను, సూచనలను ఇప్పటికే రాతపూర్వకంగా స్పీకర్‌కు అందజేశారు. దీంతో పాటు అసెంబ్లీలో సీమాంధ్ర నాయకులు చేస్తున్న ఆరోపణలను, అసంబద్ధ వాదనలను తిప్పికొట్టడంలో కూడా ముందుంటున్నారు. తెలంగాణ నాయకుల వాదనలు కూడా అసెంబ్లీ చర్చను తప్పుదారి పట్టించేదిగా కాకుండా నిర్మాణాత్మకంగా, వివేచనతోకూడి ఇతరులను మెప్పించేవిగా ఉంటున్నాయి. శుక్రవారం టీఆర్‌ఎస్ శాసన సభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తన ప్రసంగంలో తెలంగాణ జనం గుండె చప్పుడును వినిపించారు. సీమాంధ్ర నాయకులు ఎంత చెప్పినా మళ్ళా అవే అబద్దాల వాదనలు చేస్తున్న నేపథ్యంలో, విడిపోతున్న సందర్భంలో, తెలంగాణ వాదాన్ని చివరిసారిగా వినిపించవలసి వచ్చింది.

ఈటెల రాజేందర్ తన ప్రసంగంలో సీమాంధ్ర నాయకుల నీతి బాహ్యతను ఎండగట్టారు. తెలంగాణ ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షను అన్ని పార్టీలు గుర్తించాయి. తమ ఎన్నికల మానిఫెస్టోలలో పెట్టాయి. పార్టీ పరమైన స్పష్టమైన వైఖరి ప్రదర్శించిన తరువాత ఆ పార్టీల నాయకులు ఇంకా తెలంగాణ ఆకాంక్షను వ్యతిరేకించడం ఎట్లా సమంజసమనేది ఈటెల రాజేందర్ నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన వివరించారు. నీటి దోపిడీని వివరిస్తూ- రెండు నదుల మధ్య ఉన్న తెలంగాణ దూపకేడ్వడమేమిటని ఆయన ప్రశ్నించాడు. దాదాపు ఎనబై శాతం నదీ జలాల వాటా రావలసిన తెలంగాణకు దాదాపు 15 శాతం మాత్రమే ఇవ్వడంలోని దుర్మార్గాన్ని ఆయన వెల్లడించారు.

నియామకాలలో జరిగిన అన్యాయాన్ని కూడా ఆయన వివరించారు. తమకు జరిగిన అన్యాయాన్ని తాము ప్రభుత్వం ముందుకు తీసుకురావడం అయినా ఫలితం లేక పోవడం చివరకు తెలంగాణ రాష్ట్రమే పరిష్కారమని తేలిపోవడం ఈటెల చక్కగా వివరించారు. సీమాంధ్ర పాలనలో తాము అనుభవించిన క్షోభను ఆయన కండ్లకు కట్టారు. అమరవీరుల భౌతిక కాయం పట్ల కూడా వివక్షాయుతంగా వ్యవహరించి న తీరును ఆయన గుర్తు చేశారు. ఇదే సభలో తాము ఎన్నో సార్లు తెలంగాణ అంశాన్ని, తమ సమస్యలను లేవనెత్తిన విషయాన్ని కూడా ఆయన మళ్ళీ గుర్తు చేశారు. సీమాంధ్ర నాయకులు అహంకారంతో తెలంగాణ బిల్లు ముసాయిదా ప్రతులను చింపివేసి, కాలబెట్టి అపహాస్యం చేయడం ద్వారా తమ మనోభావాలను గాయపరిచిన విషయం కూడా ఈటెల రాజేందర్ ప్రస్తావించారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్, హిందువులకు భగవద్గీత ఎట్లా పవిత్ర గ్రంథాలో బిల్లు ముసాయిదా ప్రతి తెలంగా ణ వారికి అట్లా పవివూతమైందని ఆయన వివరించా రు. తెలంగాణ ఆకాంక్ష వెనుక అమరుల త్యాగాలు ఉన్నాయని, బిల్లు ముసాయిదా కాగితాలు వారి రక్తంతో తడిసి ఉన్నాయని ఆయన ఆర్ద్ర హృదయంతో వివరించారు.

విభజనను వ్యతిరేకిస్తున్న పెత్తందారీ స్వభావాన్ని ఆయన బయట పెట్టారు. సమైక్యాంధ్ర అనేది కొన్ని ప్రాంతాలకు చెందిన కొన్ని వర్గాల నాయకుల వాదన అనే అంశాన్ని ఆయన ఎత్తి చూపారు.
తెలంగాణ శాసన సభ్యులు బిల్లు ముసాయిదాపై స్పీకర్‌కు అందజేసిన సూచనలు కూడా తెలంగాణ ప్రజల మనోగతానికి అద్దం పడుతున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రెండు లేదా మూడేండ్లు మాత్రమే ఉండాలని, గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్ట వద్దని వీరు సూచించారు. ఉద్యోగులను స్థానికత ఆధారంగా గుర్తించాలనేది కూడా సబబైన సూచన. అప్పులను జనాభా ప్రాతిపదికపై కాకుం డా ప్రాజెక్టుల ఆధారంగా నిర్ణయించాలనే సూచన కూడా న్యాయబద్ధమైనదే. విద్యావకాశాలు, ఉద్యోగ నియామకాలలో కూడా తెలంగాణకు అన్యాయం జరగకుండా బిల్లును సవరించాలనే సూచనలు చేశారు.

హైకోర్టును కూడా విడదీయాలని కోరడం సముచితమైన కోరిక. తెలంగాణ సభ్యులు తమ ప్రాంతానికి అన్యాయం కొనసాగకూడదని కోరుకోవడంలో తప్పులేదు. కానీ సీమాంధ్ర శాసనసభ్యుల వైఖరే వింతగా ఉన్నది. విడిపోతున్న సందర్భంలో కూడా వారి దోపిడీ బుద్దులు మారక పోవడం ఆశ్చర్యంగా ఉన్నది. తెలంగాణ నుంచి ఏ మేర లబ్ధి పొందాలనే ఆలోచనా తీరు నుంచి వారు ఇంకా బయట పడడమే లేదు. హైదరాబాద్ ఆదాయంలో వారికి వాటా ఇవ్వాలట! తెలంగాణ ఆస్తులు వారికి పంచి ఇవ్వాలట! తెలంగాణ రాష్ట్ర అధికారాలకు కత్తెర వేయాలట! సీమాంధ్ర ప్రాంతానికి ఏమి కావాలో వారు కోరుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇంకా తెలంగాణపై ఆధారపడడమేమిటి? మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే నాటికి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండేది.

ఆరు దశాబ్దాల దోపిడీ ద్వారా సీమాంధ్ర చాలా లబ్ధి పొందిన మాట వాస్తవం. విభజన తరువాత సీమాంవూధను ఎన్నో విధాల తోడ్పడతామని కేంద్రం హామీ ఇస్తున్నది. సీమాంధ్ర ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కాళ్ళమీద తాము నిలబడడానికి యత్నించాలె. తమ మైండ్ సెట్ మార్చుకోవాలే తప్ప బిల్లు ముసాయిదాలో లోపాలు ఉన్నాయనీ, తమకు అన్యాయం జరుగుతున్నదని మొత్తుకోవడం వల్ల ఫలితం ఉండదు.

452

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

Featured Articles