క్రయోజెనిక్ రహస్యం!


Wed,January 8, 2014 12:47 AM

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా ఇవాళ ఇస్రో అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేస్తున్నదీ అంటే నంబి బృందం ఆనాడు వృద్ధి చేసిన వికాస్ ద్రవ ఇంధన ఇంజన్‌లే కారణం.
క్రయోజెనిక్ ఇంజన్‌ను అమర్చిన భూస్థిర ఉపక్షిగహ ప్రయోగ వాహకం (జిఎస్‌ఎల్‌వి) అలవోకగా జిసాట్ 14 ఉపక్షిగహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టడం ద్వారా మన శాస్త్రవిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే కాదు, ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటుకున్నాం.

రెండు టన్నులకు పైగా బరువున్న ఉపక్షిగహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టగలిగే సామర్థ్యం ఇప్పటి వరకు అమెరికా, రష్యా వంటి ఐదు దేశాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ శక్తియుక్తులను భారత్ సంతరించుకున్నది. ఇందుకు క్రయోజెనిక్ పరిజ్ఞానం కీలకమైంది. ఈ పరిజ్ఞానాన్ని భారత్‌కు రష్యా అందించకుండా అమెరికా గతంలో ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో క్రయోజెనిక్ ఇంజన్‌లను మన దేశంలోనే రూపొందించి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాగించిన కృషి అభినందనీయం. క్రయోజెనిక్ పరిశోధన సాగే క్రమంలో నంబి నారాయణన్ వంటి శాస్త్రవేత్తలకు ఎదురైన చేదు అవమానాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం.

అంతరిక్ష పరిజ్ఞానంలో అంగలు వేస్తున్న భారత్ క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు కోసం 1992లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ పరిజ్ఞానం ఇవ్వడానికి అమెరికా 950 కోట్లు, ఫ్రాన్స్ 650 కోట్లు డిమాండ్ చేస్తే, రష్యా 235 కోట్ల రూపాయలకే అందించడానికి అంగీకరించింది. భారత్ ఈ పరిజ్ఞానం సంతరించుకుంటే తక్కువ ధరకు అనేక దేశాలకు ఉపక్షిగహాలను ప్రయోగించి పెట్టగలదు. ఆనాడే అంతరిక్ష పరిశోధనా ప్రయోగ రంగంలో ముప్పైవేల కోట్ల డాలర్ల వ్యాపారం కొన్ని పెద్ద దేశాల పిడికిటిలో ఉన్నది. అంతరిక్ష రంగంలో భారత్ ఎదగకుండా అడ్డుకోవడానికి అమెరికా ఇస్రోపై ఆంక్షలు విధించి, క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని బదలాయించకుండా రష్యాపై ఒత్తిడి తెచ్చింది. దీంతో రష్యా మరో మార్గంలో ఈ పరిజ్ఞానాన్ని భారత్‌కు అందించడానికి సిద్ధపడ్డది. క్రయోజెనిక్ ఇంజన్‌ను ఫాబ్రికేట్ చేయడానికి రష్యా అంతర్జాతీయ టెండర్ వేస్తుంది. కేరళకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ కెల్‌టెక్ అత్యంత తక్కువ ధరకు కొటేషన్ ఇచ్చి ఈ టెండర్ సంపాదిస్తుంది. ఆ ఇంజన్ ఆధారంగా భారతీయ శాస్త్రవేత్తలు క్రయోజెనిక్ పరిజ్ఞానం వృద్ధి చేసుకుంటారు. కానీ ఈ పథకం అమలయ్యే దశలోనే విషాదకరమైన మలుపు తిరిగింది. క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించే ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై గూఢచార కేసును కేరళ పోలీసులు బనాయించారు. ఆయనను యాభై రోజులు అనేక విధాలుగా హింసించారు.

నంబి నారాయణన్, మరికొందరు దేశ ద్రోహానికి పాల్పడినట్టు పోలీసులు పుంఖాను పుంఖాలుగా కథనాలు వెల్లడిస్తుంటే, అవి పత్రికలలో సంచలనాత్మకంగా వచ్చాయి. నంబి అరెస్టు వల్ల ఆనాటి క్రయోజెనిక్ ఇంజన్‌ల తయారీ ఆగిపోయింది. నంబి నారాయణన్ తదితరులను వేధించడంపై గగ్గోలు పుట్టడంతో కేసు సీబీఐకి చేరింది. సీబీఐ దర్యాప్తులో నంబి నారాయణన్ నిర్దోషి అని, పోలీసుల ఆరోపణలు కట్టుకథలని తేలింది. సుప్రీం కోర్టు కూడా ఆయనను నిర్దోషిగా తేల్చింది. కేరళ హైకోర్టు ఆయనకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కానీ కేరళ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. పోలీసులపై కేసులను అల్పమైన కారణాలు చూపి ఎత్తివేసింది. నంబినారాయణన్‌ను వేధించిన పోలీసు అధికారి సిబి మాథ్యూస్‌కు పదోన్నతులు లభించాయి. ఇప్పుడు ఆ ఘనుడు కేరళలో ప్రధాన సమాచార కమిషనర్‌గా వెలిగిపోతున్నాడు. సూర్యనెల్లి అత్యాచార కేసు దర్యాప్తులో ఈయన నిందితుల కొమ్ముకాసిండంటూ ఇప్పుడు వివాదం సాగుతున్నది.

భావి ప్రయోగాలకు ద్రవ ఇంధన ఇంజన్‌లు కీలకమైనవని గుర్తించి 1970 దశకంలోనే వీటిని ప్రవేశ పెట్టిన ఘనత నంబి నారాయణన్‌ది. చంద్రయాన్‌తో సహా ఇవాళ ఇస్రో అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేస్తున్నదీ అంటే నంబి బృందం ఆనాడు వృద్ధి చేసిన వికాస్ ద్రవ ఇంధన ఇంజన్‌లే కారణం. తనను వేధించి క్రయోజెనిక్ కార్యక్షికమాన్ని నిలిపివేయించడానికి అంతర్జాతీయ శక్తులు పన్నిన కుట్రలో స్థానిక పోలీసులు చిన్న పాత్రధారులని, తెర ఉన్న పెద్ద మనుషుపూవరనేది ఇప్పటి వరకు తేలని రహస్యమని నంబి నారాయణన్ అంటున్నారు. గతంలో భారత అంతరిక్ష కార్యక్షికమానికి పితామహుడిగా పేరు పొందిన విక్రమ్ సారాభాయి, అణు కార్యక్షికమ పితామహుడు హోమీ భాభా వివాదాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఇప్పుడు మన దర్యాప్తు అధికారుల చేతనే శాస్త్రవేత్తలు వేధింపులకు గురయ్యారు.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అనేక మంది శాస్త్రవేత్తలు విదేశాలలో జీతాలకు, పదవులకు ఆశపడకుండా ఇక్కడకు వచ్చి మన దేశ శాస్త్రసాంకేతిక, పారిక్షిశామిక రంగాలకు పునాదులు వేశారు. నెహ్రూ విదేశాలలోని యువ శాస్త్రవేత్తలను చదువుకునే రోజుల్లోనే సంప్రదించి పిలిపించుకునే వారని అంటారు. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలోని అన్ని రంగాలలోకి చీడపురుగులు చేరి వేర్లను, కాండాన్ని తొలిచే ప్రమాదం ఏర్పడింది. విద్యా పరిశోధనాది రంగాలలో జాతీయ భావాలు గల శాస్త్రవేత్తలను, మేధావులను కాపాడుకోవడం మన బాధ్యత.

778

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

Featured Articles