కుట్రపూరితం


Thu,January 2, 2014 01:17 AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆపద్ధర్మ ప్రభుత్వాలే. ఈ మాత్రం మహద్భాగ్యానికి ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్చవలసిన అవసరం ఉన్నదా!
ఇటువంటి నిష్ఫలమైన చర్యలు తీసుకునే బదులు ఈ కొద్ది పాటి కాలంలో శాసనసభను ఉత్తమమైన చర్చావేదికగా ఉపయోగించుకుంటే బాగుండేది.

సభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను మంత్రి శ్రీధర్‌బాబు నుంచి తప్పించి తెలంగాణపై విషం చిమ్ముతున్న సీమాంధ్ర నాయకుడికి అప్పగించడం ఆంధ్ర పాలకవర్గాల అల్పత్వాన్ని, వివక్షను వెల్లడిస్తున్నది. తెలంగాణ ప్రక్రియను అడ్డుకోలేక పోతున్న సీమాంధ్ర పాలకవర్గాలు నిస్పృహకు గురయ్యాయని ఈ హాస్యాస్పద నిర్ణయం వల్ల మరింత ధ్రువపడుతున్నది. మంత్రుల శాఖలు మార్చడం సాధారణ సమయాలలో ఇంత వివాదాస్పదం కాదు. కానీ సభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సందర్భంలో ఈ బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం నైతికంగా సమర్థనీయం కాదు. రాష్ట్రపతి పంపించిన రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాపై శాసన సభ అభివూపాయాలు వెల్లడించవలసిన దశ ఇది. ఈ రాజ్యాంగ ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుకోవడానికి సీమాంధ్ర నాయకులు అనేక తొండి వేషాలు వేస్తున్నారు.

అన్ని ప్రాంతాల పట్ల సమభావంతో వ్యవహరించ వలసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ శాఖ మార్పిడి ద్వారా సీమాంధ్ర పెత్తందారుల చర్యలకు సహకరిస్తున్నాడనే విమర్శలు రావడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యమంత్రి చర్య పట్ల ఇప్పటికే తెలంగాణ అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా బంద్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకే చెందిన రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రి చర్యను ఖండించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి సున్నితంగా ఉన్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఇటువంటి వివాదాస్పద చర్య తీసుకోకపోవలసింది.


బిల్లు ముసాయిదా వచ్చిన నాటి నుంచి సీమాంధ్ర పాలకవర్గాలు అనేక రకాల కుట్రలకు పాల్పడుతున్నాయి. శాసనసభలో అన్ని ప్రాంతాలకు, పార్టీలకు చెందిన సభ్యులంతా అభివూపాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ సీమాంధ్ర నాయకులు కాయించుకుని గొడవలు చేస్తున్నారు. బిల్లు ముసాయిదా కాగితాలను చింపడం, కాలబెట్టడం మొదలుకొని అసలు సభా కార్యక్షికమాలే జరగకుండా అడ్డుకున్నారు. పనికిరాని విషయాలపై చర్చ పెట్టి రాద్ధాంతం చేస్తున్నారు. బిల్లు ముసాయిదాను సభలో ప్రవేశ పెట్టిన విషయాన్ని కూడా అంగీకరించడానికి సిద్ధపడక పోవడం విచిత్రం. బిల్లు ముసాయిదాను శాసన సభలో ప్రవేశ పెట్టారనేది వాస్తవం. దీనిని సభ చర్చకు చేపట్టిన మాట నిజం. అధ్యక్ష స్థానంలో ఉన్నవారు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. సీమాంధ్ర నాయకులు ఈ వాస్తవాన్ని గుర్తించకుండా చర్చనే ప్రారంభం కాలేదంటూ ఉల్టా దబాయిస్తున్నారు. సభలో చర్చ మొదలయిందా లేదా అంశంపై అనవసర రాద్ధాంతం వదిలి, అసలు విష యం చర్చిద్దామనే సభాధ్యక్షుల సూచనకు సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో అందరూ అంగీకరించారు కూడా.

అయినా సీమాంధ్ర నాయకులు లేని వివాదాన్ని సృష్టిస్తూ గొడవలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ వివాదంలో ఒక పక్షం వహించి వకాల్తా పుచ్చుకోవడం విమర్శలకు గురైం ది. ఈ దశలో సభా వ్యవహారాల మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు నిజాయితీగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి వాదనకు భిన్నంగా ధైర్యంగా వాస్తవాలు వెల్లడించారు. బిల్లు ముసాయిదాను సభ చేపట్టిందని స్పష్టంగా చెప్పారు. నిబంధనలకు కట్టుబడి ఉంటున్న తెలంగాణకు చెందిన శ్రీధర్‌బాబును సభా వ్యవహారాల మంత్రిగా కొనసాగించ కూడదని ముఖ్యమంత్రి భావించారనేది స్పష్టం. శాసన సభ సమావేశాలు మళ్ళీ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. బిల్లు ముసాయిదాపై మళ్ళా గొడవ చేయడానికి సీమాంధ్ర నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్‌బాబు చేతి నుంచి కీలకమైన సభా వ్యవహారాల శాఖను తప్పించారనేది తేటతెల్లంగా కనబడుతూనే ఉన్నది.


మంత్రి శ్రీధర్‌బాబు నుంచి కీలకమైన శాఖను తప్పించి సీమాంధ్ర నాయకులు సాధించేది కూడా ఏమీ లేదు. కాంగ్రెస్ అధిష్ఠానం, యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలుచుకున్న తరువాత రాష్ట్రంలోని నాయకులు చేయగలిగేదేమీ ఉండదు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటామంటూ ఇంతకాలం హడావుడి చేసిన సీమాంధ్ర నాయకులు ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. ఇకముందు చేయగలిగేది కూడా ఏమీ లేదు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకు మాత్రమే రాష్ట్ర విభజన అధికారం ఉన్నదనేది అందరికీ తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీలో ఎటువంటి అభివూపాయాలు వ్యక్తమైనా, ఏ అభివూపాయం వ్యక్తం చేయలేక పోయినా ఒరిగేదేమీ ఉండదనేది కూడా తెలిసిందే.

అయినా సీమాంధ్ర పెత్తందారులు ఏదో ఒక విధంగా హల్‌చల్ చేస్తున్నారు. సీమాంధ్ర జనాన్ని నమ్మించడానికి రోజుకో వేషం కడుతున్నారు. శ్రీధర్‌బాబు నుంచి సభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను తప్పించడం కూడా ఇటువంటిదే. శాసనసభ అభివూపాయాలు చెప్పడానికి రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈ నెల 23 తో ముగుస్తుంది. ఆ తరువాత అసెంబ్లీ ప్రాధాన్యం కోల్పోతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఎంతో దూరంలో లేదు. ఆ తరువాత ఎన్నికలు ఉంటాయి గనుక- సీమాంవూధలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏర్పడేవి ఆపద్ధర్మ ప్రభుత్వాలే. ఈ మాత్రం మహద్భాగ్యానికి ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్చవలసిన అవసరం ఉన్నదా! ఇటువంటి నిష్ఫలమైన చర్యలు తీసుకునే బదులు ఈ కొద్ది పాటి కాలంలో శాసనసభను ఉత్తమమైన చర్చావేదికగా ఉపయోగించుకుంటే బాగుండేది.

241

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...