ఆహ! ఏమి ఈ ఆంధ్రనేతలు..


Sun,August 11, 2013 12:20 AM

కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత అద్భుతమైన అపరిచితుడు ఉన్నాడని మొన్నటిదాకా కనిపెట్టలేకపోయాము. ఆయన భాష వల్ల విశేష ప్రతిభాపాటవాలున్నాయని తెలుసు. కానీ ఇంత నటనా ప్రతిభ ఉందని ‘తెల్వకండా’ పోయినందుకు చింతించవచ్చు. కిరణ్ ఇంత ద్విపావూతాభినయం చెయ్యగలడని కూడా ముఖ్యంగా సినిమావాళ్లకు ‘తెల్వకండా’పోవడం కూడా మన అదృష్టం కావచ్చు. కానీ ఆయనలో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది కూడా ఉన్నారు. తెలంగాణలో ఉద్యమం జరిగినప్పుడు ఎంపీలను కూడా జైల్లల్ల పెట్టిండు, కనీసం ఎవరిని కూడా మెసలనియ్యలేదని ఆయనను ప్రజాస్వామ్యవిరోధి, నియంత అని కూడా భావించినవాళ్లు ఇప్పుడు తప్పు ఒప్పుకొని చెంపలేసుకోవాలి. తెలంగాణ ప్రకటించిన తర్వాత సీమాంవూధలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం చేసుకోవచ్చని చెబుతుంటే ఆహా! ఈ దేశంల కిరణ్ కన్నా ప్రజాస్వామ్యవాదుపూవరని అనని వాళ్లు ప్రజాస్వామ్యవిరోధులే అనుకోవచ్చు.

పోలీసులతో కలిసి ఎట్లా ఉద్యమం చేయవచ్చో? ఎంత స్వేచ్ఛగా, పురుసత్‌గా ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను కూల్చివేయవచ్చో? మంచిగ పగ్గాలు తెచ్చుకొని విగ్రహాల మెడలల్ల వేసి బల్మీటికి గుంజిపడేసి, మంచిగ సకులం ముకులం పెట్టుకొని కూసోని సుత్తెలు, గన్నులతోటి విగ్రహాలను ఎట్లా ధ్వంసం చెయ్యవచ్చో? కిరణ్ మార్కు ప్రజాస్వామ్యంలో మాత్రమే సాధ్యం. ముఖ్యమంత్రి కిరణ్ మహా ప్రజాస్వామ్యవాది కనుక ఉద్యమం కొత్తపుంతలు తొక్కింది. మంచిగ రోడ్ల మీద ఆరామ్‌గ టైర్లేసి కాల్చవచ్చు. ఏటీఎంలు పగులగొట్టవచ్చు. మంత్రుల ఇళ్లను తీరుపాటంగ పొయ్యి కుర్సీలు, బల్లలు ఇరుగకొట్టవచ్చు. నిజంగనే కిరణ్‌కుమార్‌డ్డి ఎంత ప్రజాస్వామ్యవాది, ఆయన గనుక లేకపోతే సీమాంవూధల ప్రజాస్వామ్యం ఇంతగా పరిఢవిల్లేదా? అని కళ్లు చెమర్చనూవచ్చు. కిరణ్‌కుమార్‌డ్డిలో ఇంత ప్రజాస్వామ్యం దాగుందని కనిపెట్టలేకపోయినం. అదొక్కటే కాదు. మళ్లీ తెలంగాణల ఉద్యమం అవసరమైతే ఈ కిరణ్ మార్కు ప్రజాస్వామ్యం, ఎంత ఉపయోగకరమో. అందుకు కృతజ్ఞతలు.

కిరణ్‌కుమార్‌డ్డి డబల్ యాక్షన్‌లో దిట్ట అని కూడా తెలియక అపార్థం చేసుకున్నం. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినప్పుడు ఆయన ముఖం బాగా గుర్తున్నది. చాలాసార్లు సభలల్ల చెప్పిండు. మనమంత తెలంగాణే కద అన్నడు. నిజమే అనుకున్నం. ఎందుకంటే సీఎం డబల్ యాక్షన్ నిపుణత‘తెల్వకండా’ పోయినందుకు. మనల్ని మనం తిట్టుకోవాలి. తొమ్మిదిరోజులు ఆయన ఏమీ మాట్లాడనే లేదు. కానీ మొన్న మల్లా క్యాంపు ఆఫీసుల ఎంత బాగా నటించిండు. జబర్దస్త్. కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి ఎవరూ అక్కరకురారు. ముఖం పూర్తిగ మార్చిండు. ఏవో నోటికొచ్చిన లెక్కలు కూడ ధీమాతోటి చెప్పిండు. నోటికొచ్చిన అనుమానాలన్నీ ఫటాఫట్ చెప్పిండు. అప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉంటాడని, అనుకున్నప్పుడు ఎంత మంచి మొఖం పెట్టిండో? ఇప్పుడు లోపల తన్నుకులాడ్తున్న సీమాంధ్ర ఆత్మ ప్రతిఫలించేటట్టు ఎంత గంటు మొఖం పెట్టిండో.. ఈ మొఖాన్ని నేనైతేమరచిపోలేను. ఏదో ముల్లెపోయినట్టు ఎంతబాగ నటించిండో? అందుకని కిరణ్‌కుమార్‌డ్డి, ఇంగ అపార్థం చేసుకోవద్దు. ఆయనలో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది, గొప్ప డబుల్‌యాక్షన్ సామర్థ్యంగల నటుడూ ఉన్నడు. అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకోరూ.

ఒక్క కిరణ్‌కుమార్‌డ్డి మాత్రమే కాదు. డీజీపీ దినేష్‌డ్డి మీద కూడా ఆయన ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేస్తడు అని నాకో అనుమానం ఉండె. తెలంగాణలో ఆంధ్రా ప్రాంతీయ బుద్ధితో ఆయన పిల్లల మీద పోలీసులను ఉసికొల్పుతున్నడని కూడా ఉండె. కానీ.. జూలై 30 తర్వాత సీమాంవూధలో ఉద్యమాలు నడుస్తున్న తీరు, మంచిగ అందరుకూడి ఉద్యమాలు చేస్తున్నతీరు, విగ్రహాలను, అంత మంచిగ కూలగొడ్తున్న తీరు, అయినా సెటాన సెంపదెబ్బ కొట్టకుండా ప్రజాస్వామ్యం నాలుగు కాళ్ల మీద నడుస్తున్న తీరు చూస్తుంటే దినేష్‌డ్డి మీద కూడా గౌరవం పెరిగిపోయింది. సోషలిస్టు రాజ్యాలల్ల మాత్రం పోలీసులు ఇట్లుంటరా. ఉద్యమాల పట్ల ఇంత సానుభూతిగా,సామరస్యంగా ఉంటరా? నిజానికి ఊర్కెనే తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోలీసుల మీదపడి ఏడుస్తుంటరు కని ఇంత మంచి పోలీసు వ్యవస్థ భవిష్యత్‌లో ఇంకెంత మంచిగుంటదో కదా! ఒకవేళ తెలంగాణ ఏదన్న కిందిమీదైతే దినేష్‌డ్డి, ఆయన పోలీసు బృందం ఇప్పుడు సీమాంవూధలో నేర్చుకుని అమలుపరుస్తున్న గొప్ప ప్రజాస్వామ్యస్ఫూర్తితో, పరిణతి పొంది తెలంగాణ ఉద్యమశక్తులకు మార్గదర్శకులు కాకమానరు.

అప్పుడు తెలంగాణల కూడా మంచిగ తీరుపాటంగా ఇష్టంలేని విగ్రహాలను కూలగొట్టవచ్చు. పగ్గాలు తెచ్చుకొని మంచిగ విగ్రహాలను గుంజిగుంజి కిందపడేసి నడిబజార్ల ఈడ్చుకపోవచ్చు. ఇదెంత మంచి మార్గదర్శకం. ప్రజాస్వామ్యాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నా దినేష్‌డ్డి పోలీసు బృందంపైన కక్షగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఇప్పటికైనా తెలుసుకోగలిగినందుకు ఎంత ఆనందమో! తెలంగాణ ఉద్యమం మళ్లీ గనుక అనివార్యమైతే వస్తే ముఖ్యంగా మా యూనివర్సిటీ పిల్లలకు ఆ ఎన్‌సీసీ గేటుదా ఆరామ్‌గా వచ్చి విగ్రహాలు కూల్చిపోయే ఛాన్స్‌ను ఊహిస్తుంటెనే ఆహా ఏమి ఈ భారతదేశంలో, అందునా ఆంధ్రవూపదేశ్‌లో పుట్టినందువల్ల కదా! ఈ ప్రజాస్వామ్య ఫలాలు అందుకున్నాం అని ఎంత ఖుషీగ ఉన్నదో? ఒకవేళ విద్యార్థులు రాకున్నా ప్రజాస్వామ్యం కోసం దినేష్‌డ్డి గారి పోలీసులు గొరగొర గుంజుకచ్చి ఉద్యమం చేపిస్తరని నమ్మకం వచ్చింది.
‘అయ్యకు పుట్టిన ఆరుగురు పరమబాగోతులు’ అని... ఒక్క కిరణ్‌కుమార్‌డ్డి గొప్పతనం సంగతే కాదు. తెలంగాణను రెండోసారి సీడబ్ల్యూసీ ప్రకటించినంక సీమాంధ్ర మొత్తం నేతల ప్రతిభాపాటవాలు ఎంత బాగా బయటపడ్తున్నవో? అవి ‘తెల్వకండా’ ఎంత అపార్థమో..

ముఖ్యంగా చంద్రబాబు ప్రతిభ సంగతి తెలియజేసుకోవాలె. చంద్రబాబు ‘జ్ఞానం, ప్రతిభ’ మీదా సందేహాలుండె. అవి ఉత్తవని తేలింది. కానీ నిన్నటితోటి చంద్రబాబులో దాగున్న అద్భుత భవిష్యత్ దర్శకుడు బయటపడి నన్నునేను తిట్టుకున్నా. ముందు ఆయన సాత్వికునిలా, రామకృష్ణ పరమహంసలా మాట్లాడారు. ఆ తర్వాత గొప్ప సంయమనంలో రాజధానికి లక్షల కోట్లు కావాలని అన్నడు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌డ్డి డబల్‌యాక్షన్ ప్రతిభాపాటవాలకు దిగ్భ్రాంతి చెంది ఉన్నందువల్ల కూడా కావొచ్చు కానీ, ఆయన పోటీ పడ్డారు. సినిమాలల్ల చూపినట్టు ఆయన సంయమన ఆత్మతోటి అద్దంల అసలు సిసల్ అవ్వల్ సీమాంధ్ర ఆత్మ సంఘర్షించినట్టున్నది. దాంతోటి ప్రధానికి ఒక లేఖ రాసిండు. దాంట్ల విజ్ఞాన ప్రతిభ కొంచెం మరుగునపడింది. కని చంద్రబాబులోని నిఖార్సయిన జ్ఞానం ‘తెలుగు జాతి గౌరవం’ అనటంతోటే బయటపడిపోయింది.

చానకాలం నుంచి ఆయనకు సీఎం పదవి లేదు. కని పాపం ఆ లెక్క ఈ లెక్క చెప్పుకుంట సీఎం ననే భ్రాంతితో మనకు అనేక విషయాలు తెలియజేసుకోవటం తోటి, ప్రజల కోసం బాబు పడ్తున్న బాధ మనకు తెల్వలే. కని ఒక గుప్పిచ్చి మల్లా ‘తెలుగుజాతి ఆత్మగౌరవం’ యాత్ర చేస్తా అనేటాళ్లకు అర్థమయింది. అబ్బా బాబు బుర్రలో కదలాడే పాదరసం పవర్. సరిగ్గ ముప్పయేండ్ల కిందట ఎన్టీఆర్ ఇగో సరిగ్గ గీ తెలుగు జాతి ఆత్మగౌరవం తోటి తెలంగాణను మూడుకోలల లోతున పాతిపెట్టి మైరపింపజేసి కనికట్టు చేసిండు. అటెంక చంద్రబాబు అసెంబ్లీల తెలంగాణ అంటె మర్యాదదక్కదని కట్టడీ చేసిండు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విభజన ఆగుతది. సీమాంధ్ర ఇట్లనే, ఎప్పటిపూక్కనె తెలంగాణ మీద సవారి కూడ చెయ్యవచ్చు. బాబు బ్రెయిన్‌ను గుర్తించనందుకు చాలామంది ఇప్పుడు బాధపడాలె. బాబు గందరగోళం మనిషని అనుకున్నవాళ్లు, రెండు కండ్ల సందిగ్ధవాది అనుకున్నవాళ్లు వీలైతే ఆయనకు సారీ చెప్పాలె. ఎందుకంటె తెలంగాణ ప్రకటన వచ్చినంక ఆయన మహాత్మగాంధీ లెవెల్లో ప్రశాంతంగ మాట్లాడిండు. ప్రధానికి రాసిన ఉత్తరంల కొంత అటు ఇటు కాకుండ రాసిండు. కని ఎంత క్లారిటీ. ‘తెలుగు జాతి ఆత్మగౌరవం’ అంటే తెలంగాణ అందరికి తెలుసు. ఎవరి గౌరవమో. ఇంగ అంతకన్న క్లారిటీ ఉంటదా? అర్థం చేసుకోరూ!

జగన్ మీద నాకు చిన్నచూపు ఉండేది. ఆయన మంచి వ్యాపారవేత్త. వ్యాపారాన్ని ఫ్యూడల్ సంకెళ్ల నుంచి విముక్తి చేసి, వాళ్ల నాయన కొనసాగింపుగా కార్పొరేట్ మహాసావూమాజ్యాన్ని నిర్మించినప్పటికీ, ఆయన రాజకీయ పాండిత్యం మీద డౌట్ ఉండె. ఎందుకంటే ఇన్ని కంతలు పెట్టుకొని సోనియాగాంధీతోటి గొడవపడడం, వేరే పార్టీ పెట్టడం, తొందరపాటు, ఆవేశం, సీమ నేతల మార్కు మొండితనం అనుకున్నవానికి జగన్ ఒక్కసారి కళ్లు తెరిపించిండు. ఆయన క్రాంతిదర్శి అని తెలిసినంక కండ్లు పత్తికాయలయినయి. తెలంగాణ ఖాయం అని ముందుగాల కనిపెట్టింది జగన్. అందుకే సాఫ్‌సీదా ఆయన కుండబద్దలుకొట్టి నా భవిష్యత్ సీమాంవూధలనే అని చెప్పిండు. తెలంగాణ నాది కాదన్నడు. ఇంత దూరదృష్టి ఎవరికైనా ఉంటదా? విభజన జరగదనుకున్నప్పుడు, ఏదో అట్లనే అంటరు, అది అయ్యేదుందా? పొయ్యేదుందా? అని నమ్మినప్పుడు, వాళ్లమ్మ విజయమ్మ అమరవీరుల స్తూపాలకు కూడా దండం పెట్టింది. ప్లీనరీల కొంచెం తెలంగాణ గడబిడ రక్తికట్టింది. షిండే దగ్గర మాకు అభ్యతరం లేదన్న ప్రకటనా వచ్చింది. కానీ భవిష్యత్ తెలుసుకోవడమే రాజకీయ చాతుర్యం, లక్షణం. అందుకే జగన్‌సారు ఒక భవిష్యత్ దర్శకుడని అనవచ్చు. ఆయన క్రాంతదర్శి కూడా. ఒకటే డౌటు జైలు ఎంత మంచి స్థలం.

ఎంత మంచి ఊహలు వస్తాయో? తెలంగాణ వస్తుందో? రాదో? ఎట్లాంటి టైములో ఖాయమో చెప్పగలిగిన ఒక పరిపూర్ణ రాజకీయ మార్గదర్శకం జైలులో మాత్రమే సాధ్యమేమో. చంచల్‌గూడ జైలుకేదో మహిమున్నది. తెలంగాణలో జగన్ పార్టీల చేరిన నాయకులకే జ్ఞానరాహిత్యం ఉన్నట్లు ఇప్పుడు అర్థమవుతున్నది. ఇగ అర్థం చేసుకోవాల్సింది తెలంగాణల అడుగుబొడుగున మిగిలిన వాళ్లే. సీమాంధ్ర, ఆత్మలు మేల్కొంటున్నప్పుడు గమనించకపోవడం, ఉల్టా జగన్ ద్రోహి అనడం నా మనసుకైతే బాధ కలుగుతున్నది. ఇంతకాలం ఆయన శక్తియుక్తుల మీద అనుమానం పెంచుకున్నందుకు క్షంతవ్యుణ్ని. అర్థం చేసుకోరూ.
ఇంకా చాలా మంది ఉన్నరు. కని ఒక సీఎం, ఒక ప్రతిపక్షనాయకుడు, ఒక భవిష్యత్ సీఎం (కలలు మాత్రమే)కంటున్న ముగ్గురి ప్రతిభాపాటవాలు, నటనా చాతుర్యం, భవిష్యత్ ధర్మమే. తెలంగాణ వాళ్లు ఒప్పుకోరు కానీ, ఇట్లాంటి నాయకత్వాలు ఎంత అవసరమో? కదా!

స్టేట్స్‌మన్ అంటె అట్లుండాలె ఇట్లుండాలె అని కొందరంటరు. అయితదా? ఈ ప్రపంచంల. స్టేట్స్‌మన్ లెక్క ఉంటే కలుస్తదా? అందుకే కద పాపం కిరణ్, జగన్, బాబు చాలా స్పష్టంగా, సూటిగా మేము ఆంధ్రోళ్లం, మీరు కొట్టినా, తిట్టినా, ప్రాణం తీసినా సరే. ఆంధ్ర, ప్రయోజనాలకే కట్టుబడి ఉంటం. అక్కడ ఉద్యమాలు జరిగితేనే స్పందిస్తం. అక్కడ ఆత్మహత్యలు జరిగితేనే ఏడుస్తం. ఇదే కద ప్రజాస్వామ్యం అని ఇంత సూటిగ ఇప్పటి దాంక ఎవరన్న చెప్పిండ్రా. అందుకే ఈ ముగ్గురు ఎంత మంచోళ్లో. ముద్దొస్తున్నరు. ముఖ్యంగా వారి నటనా పాటవాలకు నాకు ముచ్చటగ అనిపిస్తది. తెలంగాణోళ్లు ఇట్లుంటరా! ముక్కుమీద దెబ్బపూక్క నాయె. నేర్చుకోవాలె. చెప్తే వినరు.
ఇంక ఈ లిస్టుల లగడపాటి, కావూరి, చిరంజీవులు, ఉండవల్లి చాలామంది ఉన్నరు కని వాళ్లదేమిపూక్క.. ఆ ముగ్గురి సాటి ఎవరూ రారు. ఆడిన మాట ఎంత ప్రతిభావంతంగా తప్పవచ్చో చెప్పిన మహాత్ములు ఎందరో?

కోదండరాం శానా కష్టపడి విభజన జరిగిపోయిందని చెప్తండు. బలవంతంగా కలిసి ఉండలేమని, సమైక్య ఉద్యమాల్లో హేతుబద్ధత లేదని పెద్ద పెద్ద ముచ్చట్లు చెబుతండు. కని ఆ ముగ్గురు మేము ఆంధ్రోళ్లమే అని ఎంత సూటిగ చెప్పిండ్రు. ఎంత సూటిగ విడిపోయిండ్రు. తలుపుపెట్టి చెప్తాంటె కొలుపుపెట్టి అడుగుడెందుకు వాళ్లకున్న ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ అబ్బుర పరిచేట్టులేవా? కొలువా కుమ్మరియ్యా!మేము ఆంధ్ర సీఎంలమే, ఆంధ్ర ప్రతిపక్షనాయకులమే, మేము భవిష్యత్తులో ఆంధ్ర ముఖ్యమంవూతులమే అని ఇంత సూటిగ చెప్పిన ఆ ముగ్గురి మీద మస్తు ప్రేమ అనిపిస్తుంది. అర్థం చేసుకోరూ! భవిష్యత్‌లో తెలంగాణల కూడా ప్రజాస్వామ్యం గురించి తలుచుకుంటే మంచిగ విగ్రహాలు కూలగొట్టవచ్చు. ఇష్టం లేకపోతే మంచిగ మంత్రుల ఇండ్లూ ముట్టడించవచ్చు. రోడ్లమీద టైర్లేసి కాల్చవచ్చు. అబ్బ ఎంత భవిష్యత్తో. అందుకు సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి, డీజీపీ దినేష్‌డ్డికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో? మా కండ్లు తెరిపిచ్చినందుకు ఆ ముగ్గురు ప్లస్ ఒక్కరికి థ్యాంక్స్.

తాజావార్త..
మనలాగే ఈ ముగ్గురే కాదు, అయ్యకు పుట్టిన పరమ బాగోతుల అసలులోతు అర్థం చేసుకోవడంలో విఫలమై వాళ్లను అపార్థం చేసుకొని ఊసర ఈ ఉద్యమాల నేపథ్యంలో సామూహిక ఆత్మహత్య చేసుకున్నయట! పాపం శమించుగాక.

-అల్లం నారాయణ
8096677444
narayana.allam@gmail.com

442

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...