పరిమితము.. విస్తృతమూ...


Sun,May 12, 2013 12:08 AM


నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా నాకు జన్మనిచ్చిన తెలంగాణ విముక్తే ముఖ్యం’ అన్న కడియం శ్రీహరి మాట అత్యంత శక్తివంతమైనది. ప్రధాన స్రవంతి రాజకీయవేత్తలు సాధారణంగా డొల్లగా మాట్లాడతారు. ఏదైతే ఉన్నదో, తెలియజేసుకుంటున్నాను, ఈ సభా ముఖంగా చెప్తూ ఉన్నాను అని ఒక్క అంశమూ లేకుండా పడికట్టు పదాలతో మాట్లాడుతూ ఉంటారు. ఒక్క కేసీఆర్ మినహాయింపు. ఆయన విలేకరుల సమావేశం అయినా, బహిరంగ సభలైనా ఏదో ఒక ‘పంచ్’ కోసం, చర్చనీయమయ్యే, అటు కొందరు, ఇటు కొందరు గుంజుకులాడే మాటలు కొన్ని సూటిగా వాడతారు. కేసీఆర్‌లో యధాలాపత కూడా తక్కు వే. మాట్లాడే మాటల్లో కావాల్సుకొని ‘పంచ్’ కోసం ‘పంచ్’ డైలాగులు కొట్టేకన్నా, భవిష్యత్‌లో ఉపయోగపడే మాటలు మాట్లాడడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా.. చంద్రబాబు వక్తా కాదు. ఒక్క మాటా సూటిగా మాట్లాడలేరు. గణాంకాలతో విసిగిస్తారు. ఇతరేతర కారణాల వల్ల ఆయన నాయకుడేమో కానీ, మాటల వల్ల అయితే ఆయన చిట్టచివరిగా తెలియజేసుకోవలసిన మాటలు రాని నాయకుడు. కిరణ్‌కుమార్‌డ్డి సరేసరి. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కానీ ఈ మధ్య ఆయన కూడా అనవసరంగా ఆవేశపడి తెలంగాణవాదానికి జీవం ఎక్కువ చేశారు. ‘ఒక్క రూపాయి ఇవ్వ ఏం చేస్కుంటావో చేస్కో’ అన్నా, బయ్యా రం ఉక్కు జీవో రద్దు చెయ్యం’ అని చెప్పినా ఆయన హావభావాలు వ్యక్తుల మీద, ఆయన ఉద్దేశించిన నేతలపైన కాకుండా, మొత్తం తెలంగాణనే అన్నంత స్థాయిలో ద్వేష భాష మాట్లాడి బదనామ్ అయ్యారు. అది కేవలం భావాల స్పష్టత కొరవడడం, ఆ భావాలను ప్రకటించడంలో నిపుణత కొరవడడం దాచుకున్నా దాగని ద్వేషం వెల్లువయి బయటకు రావడం తప్ప మరేమీ కాదు. కడియం శ్రీహరి ఇవ్వాళ్ల కుండబద్దలు కొట్టి చెప్పిన మాట సూటిగా ఆత్మను తాకే మాట. నిజమే ఒక సమయం అయితే వచ్చింది. దీనికి మూలం ఈ మధ్య కాలంలో కేసీఆర్ ఖాయం చేసిన భవిష్యత్తులో తెలంగాణ మంత్రం అయ్యే ఒక మాటలో ఉంది. ‘ఆంధ్ర పార్టీలు ఇంకా ఎందుకు తెలంగాణలో.. మన పార్టీలు మనకు లేవా’ అనేది తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే మాట. తెలంగాణవాద పార్టీ లు ఈ మాటను ఎంత బలంగా ఓటర్లలోకి తీసుకెళ్లగలిగితే.. తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతరేతర సీమాంధ్ర నాయకత్వం ఆధిపత్యంలో నడుస్తున్న పార్టీలు, సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తున్న పార్టీలు, తెలంగాణను ధ్వంసం చేసి, తెలంగాణను ఆక్రమించుకుని, వనరులు దోచి, పైగా ఉల్టా బెదిరిస్తున్న పార్టీలు అన్నీ ఆంధ్ర పార్టీలు అనే మాట ఎంతగా తెలంగాణ నెత్తికెత్తుకుంటే, తెలంగాణ కోసం మాట్లాడే, పనిచేసే పార్టీలు మాత్రమే ఇంటి పార్టీలని పరిచయం చెయ్యగలిగితే అంత ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఇప్పటి వాస్తవం. పార్టీలు గెలిచినంత మాత్రాన తెలంగాణ వస్తుందా? అనేది వేరే చర్చ. కడియం శ్రీహరి మాటలను కూడా అట్లా అర్థం చేసుకోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు మద్దతు ఇవ్వని పార్టీ, నేను తెలంగాణ కు వ్యతిరేకం కాదు అని చెబుతారు తప్ప, అనుకూలమని ఒక్క మాటా మాట్లాడని అధినాయకుని స్వభావరీత్యా అది ఆంధ్రా పార్టీ. అందువల్ల ఆ పార్టీ రాజకీయ జన్మనిచ్చిన పార్టీ కన్నా, జన్మనిచ్చిన తెలంగాణ తల్లి విముక్తి ముఖ్యం అని భావించడం ఇక్కడ కీలక పరిణామం.

నిజానికి ఇప్పుడు నడుస్తున్న చరిత్ర గానీ, గడచిన చరిత్ర గానీ ఈ పార్టీల స్వభావం ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల స్వభావం. తెలంగాణ వ్యతిరేక స్వభావం. పైకి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఆచరణలో తెలుగుదేశం పార్టీ స్వభావంలోనే తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ. కడియం శ్రీహరిగానీ, దేవేందర్ గౌడ్ కానీ తెలంగాణ స్పృహ లేకపోతే ఎంతకాలమైనా ఆ పార్టీలో ఇతరేతర కారణాల వల్ల ఉండవచ్చు. మంత్రులు కావొచ్చు. కానీ ఒకసారి నిజంగానే తెలంగాణ స్పృహతో ఆలోచిస్తే, దీనికి పెద్దగా సిద్ధాంతాలు అక్కరలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టుక కానీ, ఎదుగుదల కానీ అనంతర పరిణామాలలో అది సందర్భం వచ్చినప్పుడల్లా వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు కానీ అర్థం చేసుకునే నిజాయితీ ఉంటే తెలంగాణవాదుపూవరూ ఆ పార్టీలో ఉండనక్కరలేదు. కాంగ్రెస్‌లో అయితే ఒక్క నిమిషం కూడా ఉండనక్కరలేదు. అది పూర్తిగా తెలంగాణను వంచించి, ద్రోహం చేసిన పార్టీ. దేవేందర్ గౌడ్ బయటకు వచ్చినప్పుడు సరిగ్గా ఈ మదన పడి బయటకు వచ్చారు. ఆయ న నిలబడలేకపోయాడు. ఇవ్వాళ ఆయన ఎన్ని కబుర్లు చెప్పినా కేసీఆర్ స్వభావానికి నాకు పడదని చెప్పినా అంతిమంగా ఆయనలో జరిగిన అంతర్మథనం నిష్ఫలమయింది. అది వ్యక్తిగత ప్రయోజనాలకు, బహీనతలకు బలయిపోయింది. తెలంగాణ మీద మమకారాన్ని, ఇతరేతర అంశాలు కమ్మేసి ఆయన సర్దుకున్నారు. పదవి ఉండవచ్చేమో కానీ, తెలంగాణవాదుల, ప్రజల మనసుల్లో ఆయన పలచన అయ్యా రు. కేసీఆర్ స్వభావాల గురించి మాట్లాడడం ఒక తప్పుడు సాకు మాత్రమే. తెలంగాణ ఆకాంక్ష అర్థం కాకపోవడమే. తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఏకైక ప్రధాన స్రవంతి రాజకీయ ప్రతినిధి అన్నది నిజమే. కానీ తెలంగాణ ఆకాంక్ష స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమయినట్టే దేవేందర్‌గౌడ్ కూడా అయ్యారు. తెలంగాణకు మద్దతుగా ఉన్న పార్టీలున్నాయి. రాజకీయ పార్టీలనట్లా పక్కనబెడితే ఇప్పటికీ ఉద్యమశక్తులు రాజకీయేతరంగా ఉన్నాయి. అందువల్ల ఒకసారి నిజంగానే కడియం శ్రీహరిలాగే నాకు జన్మనిచ్చిన తెలంగాణ తల్లి విముక్తి అనుకున్నప్పుడు రాజీ పడకుండా, స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, కీర్తికాంక్ష, పదవీ లాలసత, అధికార మోహం ఆశించకపోతే తెలంగాణ ఒక విశాల వేదిక. అది మామూలు మనుషులైన వందలాదిమందిని ఇప్పుడు మహా నేతలను చేసింది. అందుకే నిజంగానే తెలంగాణతల్లి విముక్తి కోరుకునేవాళ్లకు ఇప్పటికీ అందివచ్చే అవకాశం, ఆంధ్రా పార్టీల నుంచి బయటపడడం. బహానాలు, కహానీలు చెప్పడం తేలికే. కానీ తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పొందడం తమ మనిషిగా భావించడం బహుశా ఇక ముందు ఉండకపోవచ్చు.తెలంగాణ ఉద్యమం గురించి ఇప్పటి దాకా ప్రధాన స్రవంతి రాజకీయవేత్తల సంగతులు కనుక వారు సిద్ధాంతాలు గుప్పించరు. క్షేత్రంలో వారి అనుభవాలు, తమ అనుచరులు, ప్రజల సంపర్కంలో స్వీకరించే అభివూపాయాలను వడబోసి సిద్ధాంతాల స్థాయిలో మాటలు చెబుతుంటారు. తెలంగాణకు సంబంధించిన భవిష్యత్ మాట ‘ఇంటి పార్టీలు ఉండగ, ఆంధ్రా పార్టీపూందుకు దండగ’ అన్నదే. నిజానికి ఈ మాటే ఒక సిద్ధాంతం.

తెలంగాణ ఒక విశిష్ట గతం నుంచి మాట్లాడుతూ ఉన్నందువల్ల చాలా విషయాలు కలగాపులగం అయి కనబడుతుంటాయి. వర్తమానాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలో, ఒక అస్థిత్వ పోరాటాన్ని అంచనావేసి, దాన్ని ముందుకు తీసు కువెళ్లడంలో వెయ్యి ఆలోచనల సంఘర్షణలు తెలంగాణ చరివూతనుంచి, గతం నుంచి వారసత్వంగా వచ్చినవే. అవి అనివార్యం. నిజానికి తెలంగాణ ఉద్యమం పరిమితమైంది. దానికదిగా ఇదొక అంతిమ విముక్తి పోరాటం కాదు. గతం బరువులేని చోట వచ్చిన కేవల అస్తిత్వ పోరాటాల్లో ఇంత మీమాంసలు ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా తెలంగాణ రెండు సందర్భాల్లో అంతిమ విముక్తి పోరాటాలను నడిపిం ది. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నడిపింది. ఒకటి కమ్యూనిస్టుల సాయుధ తెలంగాణ పోరాటం, రెండవది నక్సల్బరీ పోరాటం. ఈ పోరాటాల పూర్తి కొనసాగింపుగా ఇప్పటి తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని చూడడం కుదరదేమో. ఎందుకంటే ఈ అంతి మ విముక్తి పోరాటాలు ఇప్పటికీ కొనసాగుతున్నవే. బహుశా తెలంగాణ వచ్చినాక కూడా ఆ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల కేవలం తెలంగాణ సాధన (భౌగోళికమనడం కుదించడమే) ఒక భిన్నతగల పరిమిత పోరాటమే. ఈ నేల మీద సాయుధ పోరాటాలు జరగకుండా ఉంటే అవి కొనసాగుతూ ఉండకపోతే తెలంగాణను పరిమితం అనక్కర్లేదు. అట్లాగే తెలంగాణ విముక్తి కోసం జరుగుతున్న పోరా టం విస్తృతమైంది కూడా. స్థానిక వనరుల దోపిడీ, వివక్ష, అర్థిక వనరుల మీద పూర్తి ఆధిపత్యం, కొలువుల దోపిడీ తోపాటు, ఒక ప్రాంతపు ఉనికిని అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సాంస్కృతిక ఆధిపత్యం ఇప్పటి తెలంగాణ సమస్య. ఆధునికానంతర వలసల స్వభావం గురించి ప్రత్యేకంగా ప్రాసంగికత సంపాదించుకున్న ఫ్రాంట్జ్ ఫానన్ లాంటి వాళ్లను అందుకే ఎక్కువ అధ్యయనం చెయ్యాల్సి ఉన్నది. అందువల్ల తెలంగాణ సాధన ఒక విముక్తి పోరాటమే అయినా అది పరిమితార్థంలో వాడాల్సిన మాటే. అంతిమ విముక్తి సాధనకు ఇది ప్రత్యామ్నయం కాబోదు. అట్లాగే ఇది పరిమిత అస్తిత్వ పోరాటం కనుకనే ఒక విస్తృత పోరాటం కూడా. అందువల్లనే తెలంగాణ సాధన ఒక ఉమ్మడి అస్తిత్వ భావనగా చూసినప్పుడు ఈ విషయం బోధపడే అవకాశం ఉంది. ఇంత సిద్ధాంతం లాంటి చర్చ దేనికి... అందుకే జయశంకర్ సారు ‘ఆర్‌ఎస్‌యూ నుంచి ఆర్‌ఎస్సెస్ దాకా’ అన్న మాట వాడారు. ఈ మాట తెలంగాణ సాధనకు కలిసి వచ్చే విశాల శక్తుల విస్తృతికి నిలు

ఇది అర్థం చేసుకుంటే తెలంగాణ సాధన ఒక వైపు ప్రధాన స్రవంతి రాజకీయ చోదకశక్తుల ద్వారానూ, మరో వైపు ప్రత్యామ్నాయ ఉద్యమాల వారసత్వ భావజాలం ఉన్న శక్తుల ద్వారానూ నడుస్తూ ఉండడం ఇప్పటి వాస్తవం. నిజానికి తెలంగాణ సాధన విషయంలో ఇవేవీ ఒకదానికి ఒకటి ఎదురుబొదురుగా నిలబడాల్సిన పనిలేదు. ఒక దాన్ని ఇంకొకటి విమర్శించుకోవాల్సిన పనికూడా ఈ సందర్భంలోలేదు. నిజమే ప్రత్యామ్నాయ శక్తులే ఉద్యమం నడిపిస్తే, ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలిపితే బాగానే ఉంటుంది. ఈ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధిస్తే ప్రగతిశీలత, గత వారసత్వాలతో, వర్తమానం అనుసంధానం అవుతుంది. అంతిమంగా స్థానిక వనరుల కోసం పోరాడే ఏ పోరాటమైనా ఇప్పటి ప్రపంచ కాలమాన పరిస్థితుల్లో ఏకధృవ, సామ్రాజ్యవాద, మార్కెట్‌శక్తులకు వ్యతిరేకమైందే. తెలంగాణ సాధన పోరాటం ఎంత పరిమితమైందయినప్పటికీ, అది బయ్యారం ఉక్కు లాంటి వనరుల పరిరక్షణ కోసం కూడా పోరాడితే, అదిప్పటి ఆధిపత్య శక్తుల వ్యతిరేక పోరాటమే అవుతుంది. అట్లాగే ప్రత్యామ్నాయం బలపడనప్పుడు, మరి గత్యంతరం లేనప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతాలకన్నా సామాన్యమైన ప్రధాన స్రవంతి రాజకీయ నేతలు మాట్లాడే మాటలే సిద్ధాంతాలవుతాయి. కడియం శ్రీహరి ఇవ్వాళ అన్న మాటలు కానీ, కేసీఆర్ అన్న ఆంధ్రా పార్టీలను ఎన్నా ళ్లు మోస్తాం, మన స్వీయ రాజకీయ అస్తిత్వం అనే మాట కానీ చాలా శక్తివంతమయ్యే సందర్భం ఒకటి భవిష్యత్తులో అందరికీ అనుభవంలోకి రాక తప్పదు. నిజానికి స్వీయ రాజకీయ అస్తిత్వం అనేది కూడా సైద్ధాంతికపరంగా కానీ, లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ దేశాల్లో కానీ భిన్నంగా, లోతుగా వాడిన మాట. తెలంగాణలో ఈ మాటను కొంత యాంత్రికంగా వాడుతున్న మాట నిజమే. గతం బరువుతో ఆలోచిస్తే స్వీయ రాజకీయ అస్తిత్వం కూడా ఒక ప్రత్యామ్నాయమే. తెలంగాణ పోరాడింది. పోరాడుతూనే ఉన్నది. కాలం పొడవు పెరుగుతున్న కొద్దీ అన్ని ఉద్యమాల్లాగే అది కూడా లోచూపుతో పరిష్కరించుకోవాల్సిన కీర్తికండూతి, అధికార దాహం, డబ్బు ప్రభావం లాంటి చెడుగుల దిక్కు కూడా అప్పుడప్పుడు మళ్లుతూ ఉన్నది. ఈ సమయాల్లో సీమాంధ్ర పెత్తందారుల ఆర్థిక మూలాలను దెబ్బతీసి నిరంతర ఉద్యమాలు, ఒత్తిడి ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించుకుందామనే శక్తులు ముఖ్యమైనవే. అది అసలైన మార్గమే. కానీ ప్రధాన స్రవంతి రాజకీయాలు మాత్రమే సాధించగలిగిన రాజకీయ ప్రక్రియకు ప్రత్యామ్నాయ పోరాటాలకు శతృత్వం అక్కరలేదు. తెలంగాణ పోరాటం పరిమితమైనది, విస్తృతమైనది అని అర్థం చేసుకోవడం ఇప్పటి అవసరం. అందుకైనా ఇంటి స్పృహ, ప్రాంత స్పృహ, తల్లి విముక్తి స్పృహ గల వారికి స్వాగతం పలకడమే. అది కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం కాక తప్పదు. ఆంధ్రా పార్టీలు ఖాళీ కావల్సిందే. ఇంటి పార్టీలు పుంజుకోవాల్సిందే. ఉద్యమాలు నడవాల్సిందే. తప్పదు. దానికదిగా తెలంగాణ అస్తిత్వ పోరాటం స్వభావం లో పరిమితమైనది.. ఆచరణలో విస్తృతమైనది. విశాలమైనది.

-అల్లం నారాయణ
[email protected]

35

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

Featured Articles