మంగళవారం 26 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 11:38:44

జాంబీ రెడ్డి ఫ‌స్ట్ బైట్ విడుద‌ల చేసిన స‌మంత‌

జాంబీ రెడ్డి ఫ‌స్ట్ బైట్ విడుద‌ల చేసిన స‌మంత‌

అ! సినిమాతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ  ప్ర‌స్తుతం జాంబీ రెడ్డి అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హారర్‌, థ్రిల్లింగ్‌, గ్రాఫిక్స్‌ అంశాలతో నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాడు.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో  రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో రూపొందుతున్న తొలి సినిమా అని మేక‌ర్స్ అంటున్నారు.  'ఇంద్ర' చిత్రంలో చిన్న‌ప్ప‌టి చిరంజీవిగా న‌టించడంతో పాటు ప‌లు చిత్రాల్లో బాల న‌టుడిగా న‌టించిన తేజ స‌జ్జ జాంబీ రెడ్డి చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. దక్ష‌, ఆనంది క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

తాజాగా విడుద‌లైన  చిత్ర టీజ‌ర్  ఆ మేధా శ‌క్తి త‌న‌కే ఒక ప్ర‌శ్న‌గా నిలిస్తే , దైవం నేర్పే గుణ‌పాఠం.. మ‌నిషి ఉనికి కే ప్ర‌మాదం అంటూ  మొద‌లు కాగా, ఇందులో కోవిడ్ సింబ‌ల్‌తో పాటు వ్యాక్సిన్‌ని చూపించారు. జాంబీస్‌పై ద‌క్ష‌, ఆనందీలు పోరాడుతూ ప‌వ‌ర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చారు.  చివ‌ర‌లో తేజ స్టైలిష్ ఎంట్రీతో ఆక‌ట్టుకున్నాడు. ప్రేక్షకుల ఊహకందని వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం  అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని అంటున్నారు ద‌ర్శ‌కులు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.logo