మంగళవారం 26 మే 2020
Cinema - May 22, 2020 , 14:46:34

సినిమా థియేటర్లలోనే 'సినిమా' తట్టుకొని నిలబడుతుంది..

సినిమా థియేటర్లలోనే  'సినిమా' తట్టుకొని నిలబడుతుంది..

క‌రోనా దెబ్బ‌కి సినిమా ప‌రిశ్ర‌మ అత‌లాకుత‌లమైన సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్ళు  థియేటర్స్‌లో విడుద‌లైన సినిమాలు క‌రోనా ఎఫెక్ట్ వ‌ల‌న ఓటీటీ బాట ప‌డుతున్నాయి. దీంతో థియేట‌ర్ ఓన‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత వైవిఎస్ చౌద‌రి ప్ర‌క‌ట‌న ద్వారా సినిమా ధియేటర్లలోనే 'సినిమా' తట్టుకుని నిలబడింది, నిలబడుతుంది అంటూ ఓ పోస్ట్‌లో తెలిపారు. రేపు త‌న బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌క‌ట‌న‌లో అడ‌వి కాచిన వెన్నెల‌లా ఒంట‌రిత‌నాన్ని అనుభ‌విస్తున్న సినిమా ప‌రిశ్ర‌మ పూర్వ‌పు వైభ‌వాన్ని పొందుతుంని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

 


logo