గురువారం 28 మే 2020
Cinema - May 07, 2020 , 13:42:47

విశాఖ గ్యాస్ లీక్ మృతుల‌కి సంతాపం తెలిపిన యువ‌రాజ్

విశాఖ గ్యాస్ లీక్ మృతుల‌కి సంతాపం తెలిపిన యువ‌రాజ్

భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వైజాగ్ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేశారు. లీకైన గ్యాస్ వ‌ల‌న ఎంద‌రో మృత్యువాత ప‌డ్డారు. చాలా మంది ఆసుప‌త్రుల పాల‌య్యారు. ఇది నిజంగా దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌. మృతులు కుటుంబాల‌కి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. చికిత్స పొందుతున్న వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నాను. ధైర్యంగా ఉందాం. వైజాగ్‌ని కాపాడుకుందాం.

గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ‌లో  ఈ రోజు  తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విషవాయువు లీకైంది. ఎల్జీపాలీమర్స్‌ అనే కంపెనీ నుంచి ఈ గ్యాస్‌ లీకైంది. గాలిలో కలిసిన రసాయన వాయువును పీల్చి ఎక్క‌డివారు అక్క‌డే కుప్ప‌కూలి పోయారు.  ద్విచక్ర వాహానాలపై వెళ్లేవారు సైతం గిర్రున తిరిగి పడిపోయారు.  ఆ ఏరియా అంతా భయంకరంగా మారిపోయింది.  ఈ ప్ర‌మాదంలో ప‌ది వ‌ర‌కు మ‌ర‌ణించార‌ని తెలుస్తుంది. 


logo