మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 03:09:42

అర్ధనారీశ్వర తత్వంతో..

అర్ధనారీశ్వర తత్వంతో..

‘మహిళా సాధికారతను తప్పుదోవ  పట్టిస్తున్న కొంతమంది వల్ల సమాజానికి ఎలాంటి హాని జరుగుతుందో తెలియజేసే చిత్రమిది’ అని అన్నారు విక్రమ్‌ వాసుదేవ్‌ నార్ల. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అన్‌ లిమిటెడ్‌'. ‘అతి సర్వత్ర వర్జయేత్‌' ఉపశీర్షిక. ఏషాన్‌, ఆయిషా కపూర్‌ నాయకానాయికలుగా నటిస్తున్నారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘సృష్టికి మూలాధారమైన ఓంకారంలోని అర్ధనారీశ్వర తత్వం గొప్పతనాన్ని చాటిచెప్పే నవతరంప్రేమకథా చిత్రమిది. కమర్షియల్‌ హంగులతో పాటు చక్కటి సందేశం ఉంటుంది. మీడియా నేపథ్యంలో ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నాం.  హైదరాబాద్‌, లక్నోలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం. ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ను దుబాయ్‌లో తెరకెక్కించనున్నాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం:రోహిత్‌ జిల్లా.logo