గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 10:53:48

‘ఆదిపురుష్‌’లో లక్ష్మణుడి పాత్రకు మరో సౌత్‌ నటుడు

‘ఆదిపురుష్‌’లో లక్ష్మణుడి పాత్రకు మరో సౌత్‌ నటుడు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘ఆదిపురుష్‌’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఓం రావత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీలో ప్రభాస్‌ రాముడి ప్రాతలో కనిపించనుండగా.. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణుడి పాత్ర పోషించనున్నారు. ఓం రౌత్ సైతం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో సీత పాత్ర కోసం ఇప్పటికే ‘మహానటి ఫేం’ కీర్తి సురేష్‌, కైరా అద్వానీ, ఊశ్వరి రూటేలా పేర్లతో పాటు అనుష్క శర్మ పేర్లు తెరపైకి వచ్చినా ఇంకా ఎవరు ఖరారైంది తెలియలేదు. అయితే రాముడి తమ్ముడు పాత్ర లక్ష్మణుడి పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మేకర్స్‌ ఓ యువ సౌత్‌ నటుడిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లక్ష్మణ్ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. చెడుపై మంచి సాధించిన విజయం చుట్టూ కథ తిరుగనుంది. మైథలాజికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇటీవల అజయ్ దేవ్‌గణ్‌, సైఫ్‌ అలీఖాన్‌ ముఖ్యపాత్రలు పోషించిన తానాజీ చిత్రాన్ని తెరచెక్కించిన ఓం రౌత్‌ ఆదిపురుష్‌ను సైతం పాన్‌ ఇండియా స్థాయిలో తీసుకువస్తుండగా.. గ్రాఫిక్స్‌ కోసం చిత్ర బృందం స్టార్ వార్స్, అవతార్‌ సినిమాలకు పని చేసిన వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్లతో చర్చలు జరుపుతోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo