శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Aug 27, 2020 , 16:06:29

గెస్ట్ హౌస్ లో ఆర్చ‌రీ రేంజ్ కు ప్ర‌భాస్ ఏర్పాట్లు..!

గెస్ట్ హౌస్ లో ఆర్చ‌రీ రేంజ్ కు ప్ర‌భాస్ ఏర్పాట్లు..!

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రావ‌త్ తో ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆదిపురుష్ టైటిల్ తో హిందీ-తెలుగు భాషల్లో భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. క‌థానుగుణంగా ప్ర‌భాస్ పాత్ర‌కు విలువిద్య‌ నైపుణ్యాలు అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ కు డైరెక్ట‌ర్ ఓం రావ‌త్ అండ్ టీం ప్ర‌త్యేకంగా ఆర్చ‌రీలో శిక్ష‌ణ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

క‌రోనా నేప‌థ్యంలో శిక్ష‌ణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌న ఇంటి ద‌గ్గ‌రే ప్ర‌భాస్ ఆర్చ‌రీ రేంజ్ ను ఏర్పాటు చేసుకోనున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. బాహుబ‌లి టైంలో ఉన్న త‌న పాత గెస్ట్ హౌస్ లో ఆర్చ‌రీ రేంజ్ ను సెట్ చేసుకున్న ప్ర‌భాస్..ఆర్చ‌రీ ఎక్విప్ మెంట్స్ ను ఇంటి నుంచి గెస్ట్ హౌస్ కు త‌ర‌లించాలని ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆర్చ‌రీ ట్రైనింగ్ సెష‌న్ ను ప్రభాస్ షురూ చేయ‌నున్న‌ట్టు టాక్‌.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.