బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 29, 2020 , 08:56:36

సి.సి.సి కోసం క‌దిలొస్తున్న కుర్ర హీరోలు

సి.సి.సి కోసం క‌దిలొస్తున్న కుర్ర హీరోలు

కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమలోని దినసరి వేతన కార్మికులు ఉపాధిని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో సి.సి.సి.మ‌న‌స‌కోసం (కరోనా క్రైసిస్‌ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటైంది.ఈ సేవాసంస్థకు చిరంజీవి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

పేద క‌ళాకారుల‌ని ఆదుకునేందుకు  ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున‌, రామ్ చ‌ర‌ణ్, మ‌హేష్ బాబు త‌దిత‌రులు భారీగా విరాళాలు అందించారు. తాజాగా అక్కినేని హీరో నాగ చైత‌న్య రూ.25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని ఛారిటీకి అందిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు.కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ  కార్మికుల సంక్షేమం కోసం ఈ విరాళాన్ని అందిస్తున్న‌ట్టు పేర్కొన్నారు అక్కినేని నాగ చైతన్య.

ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మైన కార్తికేయ రూ.2 ల‌క్ష‌లు, లావ‌ణ్య త్రిపాఠి రూ. ల‌క్ష రూపాయ‌ల‌ని సి.సి.సికి అంద‌జేయ‌నున్న‌ట్టు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఇక క‌రోనా నివార‌ణ చ‌ర్యల‌కు యంగ్ హీరో నిఖిల్ ముందుకొచ్చారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు ముందు వ‌ర‌స‌లో ఉండి ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న డాక్టర్స్‌, మెడిక‌ల్ సిబ్బందికి చేయూత‌గా వారి ర‌క్షణ‌కి ప‌ర్సన‌ల్ ప్రొట‌క్షన్స్ కిట్స్ భారీగా అందించారు. 2000 ఎన్ 95 రెస్పిరేట‌ర్లు, 2000 రీ-యూజ‌బుల్ గ్లోవ్స్, 2000 ఐ-ప్రొట‌క్షన్ గ్లాసులు, శానిటైజ‌ర్లు, 10000 ఫేస్ మాస్కులు.. ఈ కిట్స్ అన్నింటినీ గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టెంట్ అధికారుల‌కి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అంద‌జేశారు.logo