ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 18:07:03

అగ్రెసివ్ లుక్ లో యువ న‌టుడు..స్టిల్ వైర‌ల్

అగ్రెసివ్ లుక్ లో యువ న‌టుడు..స్టిల్ వైర‌ల్

యువ హీరో నాగశౌర్య లాక్ డౌన్ స‌మ‌యాన్ని మేకోవ‌ర్ మార్చుకునేందుకు ప‌ర్ ఫెక్ట్ గా వినియోగించుకున్నాడు. ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో నాగ‌శౌర్య విడుద‌ల చేసిన కొన్ని వ‌ర్క‌వుట్స్ వీడియోలే అందుకు నిద‌ర్శ‌నం. తాజాగా నాగశౌర్య జిమ్ లో చొక్కా విప్పేసి బాడీని ఎక్స్ పోజ్ చేస్తున్న ఫొటో ఒక‌టి నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ట్రైన‌ర్ తో ఉన్న ఫొటో ట్విట‌ర్ లో పోస్ట్ చేసి.. శరీరం విష‌యానికొస్తే అదిట్రైన‌ర్ కు సంబంధించిన అంశం అంటూ ట్వీట్ పెట్టాడు. ఈ యువ న‌టుడు అగ్రెసివ్ లుక్ లో కనిపిస్తూ..ఫిజిక‌ల్ ఫిట్ నెస్ విష‌యంలో చాలా మంది సినీ తార‌ల‌కు స్పూర్తిగా నిలుస్తున్నాడు.

నాగశౌర్య త‌న 20వ చిత్రాన్ని సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆర్చ‌ర్ గా న‌టిస్తున్నాడు. దీంతోపాటు ప‌లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల‌ను కూడా లైన్ లో పెట్టాడు.  గ‌తేడాది నాగశౌర్య న‌టించిన అశ్వ‌త్థామ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo