రాజ్ తరుణ్ నిజంగానే సుడిగాడు..ఎందుకంటే..?

తెలుగు ఇండస్ట్రీకి వరుస విజయాలతో పరిచయం అవ్వడం అంటే అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద వారసులకు కూడా అది సాధ్యం కాలేదు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒకప్పుడు ఉదయ్ కిరణ్ తొలి మూడు సినిమాలతో సంచలన విజయాలు అందుకొన్నాడు. స్టార్ హీరో అయ్యాడు. కానీ అంతలోనే కిందపడిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఇబ్బందులు పడి ఏకంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ తర్వాత ఒక కొత్త హీరో వరుసగా మూడు విజయాలు అందుకున్నది ఎవరూ లేరు. అలాంటి సమయంలో రాజ్ తరుణ్ వచ్చాడు. ఈయనకు కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరో అయ్యాడు. ఈయన తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.
ఆ వెంటనే సినిమా చూపిస్త మామ అంటూ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దాన్ని ఫాలో అవుతూ కుమారి 21 ఎఫ్ వచ్చింది. సుకుమార్ నిర్మాణంలో ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21 ఎఫ్ సినిమా సంచలన విజయం సాధించింది. ఉదయ్ కిరణ్ తర్వాత తొలి మూడు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన హీరోగా రాజ్ తరుణ్ నిలిచాడు. కానీ ఆ తర్వాత తన కెరీర్ ను సరిగ్గా మలుచుకోవడంలో విఫలమయ్యాడు ఈ కుర్ర హీరో. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఈడోరకం ఆడోరకం లాంటి సినిమాలతో మధ్యలో పర్వాలేదనిపించినా కెరీర్ నిలబెట్టే విజయాలు మాత్రం అందుకోలేదు. గత కొన్ని ఏళ్లుగా ఈయన నటించిన అందగాడు, ఒరేయ్ బుజ్జిగా, రంగులరాట్నం, రాజు గాడు లాంటి సినిమాలు అంచనాలు అందుకోలేదు. అయినా కూడా ఆయనకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఒరేయ్ బుజ్జిగా ఫేం విజయ్ కుమార్ కొండా ఆయనతో మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయబోతున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అరియానా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండూ కాకుండా మరో సినిమాకు కూడా రాజ్ కమిట్ అయ్యాడు. వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఒక అవకాశం రావడమే గగనంగా ఉంటుంది. కానీ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఈ కుర్ర హీరో మాత్రం వరస చాన్సులు అందుకుంటున్నాడు. మరి ఇందులో ఏది హీరో కోరుకున్న విజయం అందిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పంత్ ఫైటింగ్ సెంచరీ.. టీమిండియాకు లీడ్
- డిజిటల్ కరెన్సీ : క్రిప్టోకరెన్సీ మార్గదర్శకాలపై ఆర్బీఐతో కేంద్రం కసరత్తు!
- బాసరలో నారా బ్రాహ్మణి పూజలు
- ఏ1 ఎక్స్‌ప్రెస్ రివ్యూ
- నలుగురితో పారిపోయి.. లక్కీ డ్రాలో ఒకరిని పెండ్లాడింది
- కూతురిని వేధిస్తున్న యువకుడికి మందలింపు : మహిళను కాల్చిచంపిన ఆకతాయి!
- పసిబిడ్డలకు ఉరేసి.. తానూ ఉసురు తీసుకుని..!
- తీరానికి కొట్టుకొచ్చిన.. 23 అడుగుల మిస్టరీ సముద్ర జీవి
- కరోనా టీకా వేయించుకున్న రాజస్థాన్ సీఎం
- కివీస్‌తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం