శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 00:10:14

నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి

నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి

రాజ్‌తరుణ్‌, మాళవికానాయర్‌ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్‌కుమార్‌కొండా దర్శకుడు. అక్టోబర్‌ 2న ‘ఆహా’ ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘కృష్ణవేణి..కృష్ణవేణి..’ అనే గీతాన్ని హీరో నాగశౌర్య  మంగళవారం విడుదలచేశారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘పాట వీనులవిందుగా ఉంది. సాహిత్యం, బాణీలు బాగున్నాయి’ అని తెలిపారు.  ‘ఎలాంటి రిహార్సల్స్‌ లేకుండా రాజ్‌తరుణ్‌ ఈ పాటలో నటించారు. జానపదశైలిలో హుషారుగా సాగే ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు చెప్పారు. కథానుగుణంగా కీలకమైన సందర్భంలో వచ్చే గీతమిదని సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌ చెప్పారు.