సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 12:55:05

నువ్వు హీరోయిన్‌..నేను హీరో: దివితో అమ్మ‌రాజ‌శేఖ‌ర్

నువ్వు హీరోయిన్‌..నేను హీరో: దివితో అమ్మ‌రాజ‌శేఖ‌ర్

నాలుగో ఎపిసోడ్ లో బిగ్ బాస్ తొలి ఫిజిక‌ల్ టాస్క్ లో అంద‌రూ టీమ్స్ గా ఏర్ప‌డి పాల్గొన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఫిజిక‌ల్ టాస్క్ ను ఇంటి స‌భ్యులు పూర్తి చేయ‌లేక‌పోయారు. టాస్క్ పూర్తి చేయ‌క‌పోవ‌డానికి కూడా క‌ట్ట‌ప్పే కార‌ణ‌మ‌ని బిగ్ బాస్ ప‌రోక్షంగా చెప్పాడు. దీంతో ప్ర‌తిదానికి అడ్డుప‌డుతున్న ఈ క‌ట్ట‌ప్ప ఎవ‌ర్రా బాబూ అని త‌ల‌లు ప‌ట్టుకోవ‌డం స‌భ్యుల వంతైంది. మ‌రోవైపు గంగ‌వ్వ ఆరు ప‌దుల వ‌య‌స్సుల్లోనూ వేకువ‌జామునే నిద్ర‌లేచి అబ్బాయిలతో పోటీ ప‌డుతూ వ్యాయామం చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కిచెన్ ను శుభ్రంగా ఉంచాల‌ని మోనాల్ చెప్ప‌గా..అమ్మ‌రాజ‌శేఖ‌ర్ కొంత అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించాడు. వంట చేయ‌డం, శుభ్రం చేయ‌డం ఒకేసారి ఎలా అవుతుంద‌ని అమ్మ‌రాజ‌శేఖ‌ర్ ప్ర‌శ్నించాడు. అమ్మ‌రాజ‌శేఖ‌ర్ అలా చెప్ప‌డంతో ఈ రోజు తాను భోజ‌నం చేయ‌నని ఉప‌వాసం ఉంటున్నానని చెప్పింది. 

మ‌రోవైపు కిచెన్ లో అమ్మ‌రాజ‌శేఖ‌ర్, దివి ఒక‌రిపై ఒక‌రు తెగ ప్రేమ కురిపించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత‌సేపు నేను హీరో, నువ్వు హీరోయిన్ అని దివితో అమ్మరాజ‌శేఖర్ క‌బుర్లు చెప్పుకుంటూ నూనెలో టీ పొడి వేశాడు. వెంట‌నే నోయల్ వారిద్ద‌రినీ టీపొడి, నూనెతో పోలుస్తూ అవి రెండూ క‌ల‌వ‌వు అని పంచ్ వేశాడు. ఇదిలా ఉంటే మోనాల్ అభిజిత్ ఒక‌రి గురించి మ‌రొక‌రు మ‌రింత లోతుగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. మోనాల్ పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే పెళ్లి చేసుకుంటాన‌ని అఖిల్ తో చెప్పుకొచ్చింది. తాను ఇప్ప‌టివ‌కైతే ఎలాంటి రిలేష‌న్‌షిప్ లో లేన‌ని మోనాల్ స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు నోయ‌ల్ ఇంటి స‌భ్యుల మీద ర్యాప్ సాంగ్ పాడితే మెహ‌బూబ్‌, దేవి నాగ‌వ‌ల్లి, దివి క‌లిసి నోయ‌ల్ మీద ర్యాప్ పాడి ఔరా అనిపించారు. 


మ‌న‌సు మార్చుకోని నోయ‌ల్‌..బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్

అఖిల్‌, సోహైల్‌, క‌ళ్యాణి, హారిక, లాస్య‌, సూర్య‌కిర‌ణ్‌..నోయ‌ల్ అఖిల్, మెహ‌బూబ్‌, సుజాత, అభిజిత్‌, లాస్య‌పై, మోనాల్‌, గంగ‌వ్వ..అమ్మ‌రాజ‌శేఖ‌ర్‌పై, అరియానా, దివి, దేవి నాగ‌వ‌ల్లి, అమ్మ‌రాజ‌శేఖ‌ర్, సూర్య‌కిర‌ణ్‌పై స్టాంపు వేశారు. అయితే నోయ‌ల్ వంతు వ‌చ్చేస‌రికి..త‌న‌కు ఎవ‌రినీ బాధ‌పెట్ట‌డ ఇష్టం లేద‌ని, అందువ‌ల్లే త‌న ముఖంపై తానే ముద్ర‌వేసుకుంటున్నాన‌ని చెప్పాడు. నోయ‌ల్ నిర్ణ‌యాన్ని ఇంటి సభ్యులు వ్య‌తిరేకించారు. అలా చేస్తే నిజ‌మైన క‌ట్ట‌ప్ప నువ్వే అవుతావ‌ని ఇంటి స‌భ్యులు నోయ‌ల్ ను వారించారు. 

నోయ‌ల్ మాత్రం ఈ విష‌యంలో మ‌న‌సు మార్చుకోక‌పోవ‌డంతో బిగ్ బాస్ రంగంలోకి దిగాడు. నీకు నువ్వే ముఖంపై స్టాంప్ వేసుకోవడానికి వీల్లేద‌ని నిర్దేశించాడు. దీంతో నోయ‌ల్ లాస్య మీద అనుమాన ఉన్నా..ఆమె ఎక్క‌డ బాధ‌ప‌డుతుందేమోన‌ని అమ్మ‌రాజ‌శేఖ‌ర్ ముఖంపై స్టాంప్ వేశాడు. ఈ ప్రాపెస్ పూర్త‌యిన త‌ర్వాత..ఈ క‌ట్ట‌ప్ప ఎవ‌ర‌నేది ఇప్ప‌ల్లో చెప్ప‌న‌ని, కానీ క‌ట్ట‌ప్ప ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో మీకే తెలుస్తుంద‌ని చెప్పి ఇంటి స‌భ్యుంల‌ద‌రికీ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత రాత్రి మాస్ట‌ర్‌.. ఇంటి స‌భ్యులు గ్యాంగ్ గా విడిపోవ‌డం పై బిగ్ బాస్ జోకులు వేశాడు.


బిగ్ బాస్ జోకుకు హాయిగా న‌వ్వుల్లో మునిగితేలుతున్న ఇంటిస‌భ్యుల్లో ఎవ‌రు ఎలిమినేష‌న్ నుంచి గ‌ట్టెక్కుతారు..? ఎవ‌రు ఔట్ అవుతార‌నేది వ‌చ్చే ఎపిసోడ్స్ లో తెలియనుంది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఓట్ల ఆధారంగా ఇద్ద‌రు కంటెస్టెంట్లు డేంజ‌ర్ జోన్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎవ‌రు ఎలిమేట్ అవుతార‌నేది నాగార్జున వ‌చ్చి చెప్పే వ‌ర‌కు వెయిట్ చేయాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo