సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 12:51:24

బాలుని క‌డ‌సారి చూడ‌లేక ఆవేద‌న చెందిన యేసుదాసు

బాలుని క‌డ‌సారి చూడ‌లేక ఆవేద‌న చెందిన యేసుదాసు

స్వ‌ర మాంత్రికుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణంతో  యావ‌త్ సినీ ప్ర‌పంచం విషాదంలో మునిగింది. ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులు, స‌న్నిహితులు బాలు మ‌ర‌ణవార్త‌ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు యేసుదాసు బాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదన చెందారు. బాలు తనకు సొంత సోదరుడి కంటే ఎక్కువని, ఆయనతో కలిసి చాలా ఏళ్ళు ప్రయాణం చేశానని చెప్పారు ఏసుదాసు.

ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న యేసుదాసు భార‌త్‌కు రావ‌డానికి అనుమ‌తి లేక‌పోడంతో క‌డ‌సారి త‌న సోద‌రుడిని చూ‌సుకోలేక‌పోయానంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భౌతికంగా బాలు మ‌ధ్య లేక‌పోయిన‌, జ్ఞాప‌కాల‌లో ఎప్ప‌టికీ ఉంటారు. బాలుతో ఎక్కువ ప్ర‌యాణం చేసాను.  సంగీత ప్రపంచంలో బాలు మార్క్ చెరిపేయలేనిదని యేసుదాసు అన్నారు. సంగీతాన్ని సాంప్రదాయబద్దంగా నేర్చుకోకపోయినా ఈ రంగంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించిన ఘనత బాలు సొంతమంటూ కొనియాడారు. అమెరికాలో ఓ సారి బాలు వంట కూడా చేసి పెట్టార‌ని చెప్పుకొచ్చారు యేసుదాసు 


logo