సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 14:07:08

క‌ళ్యాణే న‌న్ను వ‌దిలి వెళ్లింది: సూర్య‌కిర‌ణ్

క‌ళ్యాణే న‌న్ను వ‌దిలి వెళ్లింది: సూర్య‌కిర‌ణ్

ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు, క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ, వ‌సంతం, దొంగోడు వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది సీనియ‌ర్ న‌టి క‌ళ్యాణి. సినీ ఇండస్ట్రీకి చెందిన డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ ను వివాహం చేసుకుంది కళ్యాణి. అయితే కొన్నాళ్ల‌పాటు క‌లిసున్న ఈ జంట విడిపోయిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై తాజాగా సూర్య‌కిర‌ణ్ స్పందించాడు. బిగ్ బాస్ -4 లో ఎంపికైన సూర్య‌కిర‌ణ్ మొద‌టి వారం ఎలిమినేట్ అయ్యాడు.

త‌న వైవాహిక జీవితం గురించి సూర్య‌కిర‌ణ్ ఓ ఇంట‌ర్వ్యూ లో చెప్తూ..అవును క‌ళ్యాణి న‌న్ను వ‌దిలివెళ్లింది నిజ‌మే. అది నా నిర్ణ‌యం కాదు. నాతో క‌లిసి జీవించాల‌ని క‌ళ్యాణికి ఇష్టం లేదని చెప్పాడు. నాతో స‌మ‌స్య‌లు లేకున్నా..నాతో క‌లిసి జీవించ‌క‌పోవ‌డానికి ఆమెకు కార‌ణాలున్నాయ‌ని సూర్య‌కిర‌ణ్ చెప్పుకొచ్చాడు. తాను బిగ్ బాస్ కు వెళ్లడం ద్వారా క‌ళ్యాణిని మిస్స‌వ‌డం లేద‌ని, ప్ర‌తీ రోజు క‌ళ్యాణిని మిస్స‌వుతున్నాన‌ని భావోద్వేగానికి లోన‌య్యాడు. క‌ళ్యాణి నాకు చాలా బాగా క‌నెక్ట్ అయిపోయారు. ఈ జ‌న్మ‌కు నా భార్య క‌ళ్యాణియేన‌ని అన్నాడు సూర్య‌కిర‌ణ్.  ‌స‌త్యం, ధ‌న 51, బ్ర‌హ్మాస్త్రం, రాజు భాయ్ వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సూర్య‌కిర‌ణ్..ఆ త‌ర్వాత మ‌రే సినిమా చేయ‌లేదు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo