ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 17:16:20

అవును నేను మనిషిని..మొటిమలుంటాయి: ఇలియానా

అవును నేను  మనిషిని..మొటిమలుంటాయి: ఇలియానా

గోవా భామ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తూ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా పేజ్ లో ఈ భామకున్న ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువే. ఇటీవలే ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ నెటిజన్ మీ ముఖం ఎడమ చెంపపై మొటిమ ఉంది అన్నాడు. దీనికి ఇలియానా స్పందిస్తూ..,అవును నేను మనిషిని. నాకు మొటిమలు వస్తాయి. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా..? అని అడిగింది.

బర్ఫీ సినిమా ఆస్కార్ బరిలో నిలిచినపుడు మీ రియాక్షన్ ఏంటీ అని మరో నెటిజన్ ఇలియానాను అడిగాడు. నాకు అదో జోక్ లా అనిపించింది. నా టీం ప్రాంక్ గేమ్ ఆడిందనుకున్నా. మొదట నేను ఈ విషయాన్ని నమ్మలేదు. నిజాయితీగా చెప్పాలంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని అరుదైన క్షణాలు అని సమాధానమిచ్చింది. 

logo