రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ప్రీత్సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘త్రిశంకు’. శ్రీకృష్ణ గొర్లె దర్శకుడు. లండన్ గణేష్, నల్ల అయ్యన్ననాయుడు నిర్మాతలు. ప్రాచీతెహ్లాన్, రష్మీగౌతమ్ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘ఏడు రంగుల ఓ ఇంద్రధనుస్సులా’ అనే పాటను హీరో రానా విడుదలచేశారు. భాష్యశ్రీ సాహిత్యాన్ని సమకూర్చిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ, యాక్షన్, వినోదం హంగులతో రూపొందుతున్న చిత్రమిది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: హరి అయినీడు