ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 17:49:37

నాగ్ కు 'సిండికేట్' స్టోరీ వినిపించిన డైరెక్ట‌ర్..!

నాగ్ కు 'సిండికేట్' స్టోరీ వినిపించిన డైరెక్ట‌ర్..!

తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డు మ‌హి వీ రాఘ‌వ్‌. గ‌తేడాది వైఎస్సార్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన యాత్ర సినిమా బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా..విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత మ‌హి వి రాఘ‌వ్ కొత్త ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ రాలేదు. యాత్ర సీక్వెల్ తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వచ్చిన వాటిపై ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు.

తాజాగా ఈ డైరెక్ట‌ర్ సిండికేట్ అనే టైటల్ తో ఓ సినిమా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ క‌థ‌ను అక్కినేని నాగార్జున‌కు ఇప్ప‌టికే వినిపించాడ‌ని టాక్ న‌డుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి స్ప‌ష్గ‌త లేదు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ షోతోపాటు రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న నాగ్ ఈ డైరెక్ట‌ర్ కు అవ‌కాశమిస్తాడా..? లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo