బుధవారం 27 మే 2020
Cinema - May 01, 2020 , 10:45:11

తమ‌ కుమారుడిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన య‌శ్ దంప‌తులు

తమ‌ కుమారుడిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన య‌శ్ దంప‌తులు

క‌న్నడ స్టార్ హీరో య‌ష్ .. కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ పొందిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే య‌శ్ లేదా ఆయ‌న భార్య రాధికా పండింట్ త‌ర‌చుగా త‌మ ఫ్యామిలీ ఫోటోల‌ని లేదంటే కూతురికి సంబంధించిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రీసెంట్‌గా త‌మ కొడుకుని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు

యశ్‌- రాధికలు 2016లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, ఓ కొడుకు ఉన్నారు. అక్టోబ‌ర్ 30,2019న వీరికి కుమారుడు జ‌న్మించ‌గా అప్ప‌టి నుండి బుడ‌త‌డి ఫోటోని రివీల్ చేయ‌లేదు. గురువారం కుమారుడి ఫోటోని షేర్ చేసిన య‌శ్‌.. మా చిన్నోడికి హాయ్ చెప్పండి, అత‌నికి మీ ప్రేమ ఆశీర్వాదాలు అందించండి పేర్కొన్నారు . బుడ‌త‌డి ఫోటోకి జూనియ‌ర్ రాఖీ భాయ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు
logo