శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 00:08:46

యాదాకృష్ణ కన్నుమూత

యాదాకృష్ణ కన్నుమూత

సీనియర్‌ సినీ హీరో, నిర్మాత యాదాకృష్ణ(61) బుధవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. హృద్రోగ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నిజాంపేట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టిన యాదాకృష్ణ హీరోగా, నిర్మాతగా పలు చిత్రాల్ని రూపొందించారు. శృంగార  కథాంశాలతో రూపొందిన గుప్తశాస్త్రం, వయసు కోరిక, పిక్నిక్‌ వంటి చిత్రాలతో యువతరం ప్రేక్షకుల్లో చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నారాయన. సంక్రాంతి అల్లుడు, ఇరుకింట్లో ఇద్దరు పెళ్లాలు, గూఢచారి 786తో పాటు ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు. యాదాకృష్ణకు భార్య రమాదేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గురువారం ఆయన అంత్యక్రియల్ని నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


logo