అక్షి, మధు, సంజయ్, ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌వైజడ్’. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నిర్మాత. ఇ.వి.ఎన్ చారి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘రొమాంటిక్ క్రైమ్ యాక్షన్ చిత్రమిది. ఓ నిర్ణయం కొందరి జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పింది. రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో కొందరికి ఎలాంటి నిజాలు తెలిశాయన్నది ఉత్కంఠను పంచుతుంది. విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: సంపత్‌రాజ్.