మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 20:26:09

వ‌ర్క్ ను వ‌ర్షం ఆప‌లేదు..ర‌కుల్ షూటింగ్ వీడియో

వ‌ర్క్ ను వ‌ర్షం ఆప‌లేదు..ర‌కుల్ షూటింగ్ వీడియో

వృత్తిప‌ట్ల డెడికేష‌న్ చూపించే హీరోయిన్ల‌లో టాప్ ప్లేస్ లో ఉంటుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఎలాంటి ఇబ్బందులున్నా లెక్క‌చేయ‌కుండా అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ పూర్తి చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు స‌హ‌క‌రిస్తుంది ర‌కుల్‌. ఇటీవ‌లే ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌రైన ర‌కుల్ మ‌ళ్లీ ముంబై నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చేసి షూటింగ్ లో పాల్గొన్నది. క్రిష్ డైరెక్ష‌న్ లో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం షూటింగ్ వికారాబాద్ అడ‌వుల్లో కొన‌సాగుతుంది.

కొన్ని రోజులుగా రాష్ట్ర‌వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే వికారాబాద్ లోని షూటింగ్ లొకేష‌న్ లో వ‌ర్షం ప‌డుతోంది. వ‌ర్షం ప‌డుతున్నా ప‌ని ఆగేది లేదు అంటూ  ర‌కుల్ ఓ వీడియోను షేర్ చేసింది. చిత్ర‌యూనిట్  వ‌ర్షం నుంచి కెమెరాను కాపాడ‌టం వీడియోలో చూడొచ్చు. కోవిడ్ స‌రిపోయింద‌నుకుంటే..ఇపుడు హైద‌రాబాద్ వ‌ర్షాలతో అడ్డంకులు అంటూ వీడియో మాట‌లు వినిపించ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. మ‌రోవైపు వైష్ణ‌వ్ తేజ్‌-క్రిష్ ల‌ను కూడా వీడియోలో చూడొచ్చు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.