శ్రీవిష్ణు, మేఘాఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. హితేశ్ గోలి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ నెల 19న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సమాజం దృష్టిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చెలామణి అయ్యే ఓ దొంగ కథ ఇది. అతడిని పట్టుకోవడానికి ఓ పోలీస్ శతవిధాలుగా ప్రయత్నిస్తుంటాడు. ఈ దొంగపోలీస్ ఆటలో గెలుపెవరిది? ఆ దొంగ గతం ఏమిటన్నది? ఆకట్టుకుంటుంది. రెండున్నర గంటల పాటు అపరిమితమైన వినోదాన్ని అందిస్తుంది. శ్రీవిష్ణు పాత్ర విభిన్నంగా ఉంటుంది’ అని తెలిపారు. సునైన, తనికెళ్లభరణి, గంగవ్వ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, సినిమాటోగ్రఫీ: వేదరామన్.