కేపీఎన్ చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సేవా దాస్’. వినోద్ రైనా ఎస్లావత్, సీతారామ్ బాదావత్ నిర్మాతలు. ప్రీతి అశ్రాని, రేఖా నిరోషా కథానాయికలు. తెలుగు, బంజారా భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. గురువారం బంజారా భాషకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ ‘బంజారాల ఆది గురువు సేవాలాల్ పాత్రలో నేను నటిస్తున్నా. ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది. వాణిజ్య హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం అందరికి కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు. “గోర్ జీవన్’ తర్వాత నేను రూపొందిస్తున్న చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఆడియోను విడుదలచేస్తాం’ అని కేపీఎన్చౌహన్ తెలిపారు.