విదార్థ్, ధృవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భగత్‌సింగ్‌నగర్’. వాలాజా గౌరీ, రమేష్ ఉడత్తు నిర్మాతలు. వాలాజా క్రాంతి దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘భగత్‌సింగ్ నగర్ అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ జంట మధ్య మొదలైన ప్రేమాయణం ఎలాంటి అనర్థాలకు దారి తీసింది? అడ్డంకులను ఎదురించి వారు ఎలా ఏకమయ్యారన్నది ఆకట్టుకుంటుంది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులతో పాటు కేరళలలో కీలక ఘట్టాలను చిత్రీకరించాం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. రవిప్రకాష్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి.