శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 20:09:46

సాయినాథుడి ఆశీస్సుల‌తో రాజ‌శేఖ‌ర్ కోలుకోవాలి...

సాయినాథుడి ఆశీస్సుల‌తో రాజ‌శేఖ‌ర్ కోలుకోవాలి...

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు ఇప్ప‌టికే తెలిపారు.  నాన్న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. త‌న తండ్రి క్షేమంగా తిరిగి రావాల‌ని కోరుతూ అంద‌రు ప్రార్ధ‌న‌లు చేయాల‌ని రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక కోరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడు మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు. 

నా స‌హ‌చ‌రులు, స్నేహితులు రాజ‌శేఖ‌ర్, జీవిత క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నా. సాయినాథుడి ఆశీస్సుల‌తో రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకుని..మ‌ళ్లీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనాల‌ని కోరుకుంటున్న‌ట్టు ట్వీట్ లో పేర్కొన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.