బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 03, 2020 , 18:03:04

‘విల్‌ ఫ్రమ్‌ హోం’ లాంఛ్‌ చేసిన హాలీవుడ్‌ స్టార్‌

‘విల్‌ ఫ్రమ్‌ హోం’ లాంఛ్‌ చేసిన హాలీవుడ్‌ స్టార్‌

లాస్‌ ఏంజెల్స్‌: హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ విల్‌ స్మిత్‌ స్నాప్‌చాట్‌ లో కొత్త సిరీస్‌ను లాంఛ్‌ చేశాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా యావత్‌ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలు సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌కు పరిమితమైన విషయం తెలిసిందే. అయితే అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో కరోనా పాజిటివ్‌ తేలిన చాలా మంది పేషంట్లు ఐసోలేషన్‌ లో చికిత్సపొందుతున్నారు. వారిలో మనోైస్థెర్యం నింపేందుకు, ఐసోలేషన్‌ లో ఉన్న వారి పరిస్థితులపై  ప్రతీ రోజు ఫాలో అవుతున్న దినచర్యలపై, వారి కుటుంబసభ్యులు, సెలబ్రిటీ స్నేహితులతో స్నాప్‌ ఛాట్‌ ద్వారా విల్‌ స్మిత్‌ చర్చించనున్నాడు.

తొలి రోజు ఎపిసోడ్‌లో భాగంగా విల్‌ స్మిత్‌ తన గ్యారేజ్‌లో నుంచి బయటకు వచ్చి..సామాజిక దూరాన్ని పాటించాడు. విల్‌స్మిత్‌తోపాటు టైరా బ్యాంక్స్‌ తన ఇంటిలో సామాజిక దూరం ఎలా పాటిస్తుందో కూడా చెప్పింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo