గురువారం 28 మే 2020
Cinema - May 03, 2020 , 22:33:26

బన్నీతో ఐటెంసాంగ్‌?

బన్నీతో ఐటెంసాంగ్‌?

సుకుమార్‌ సినిమాల్లో ఉర్రూతలూగించే ఐటెంసాంగ్‌ తప్పకుండా ఉండాల్సిందే. కథాంశాలపరంగా ప్రయోగాలు చేయడంతో పాటు ప్రత్యేక గీతాల్ని తనదైన పంథాలో జనరంజకంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు సుకుమార్‌. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్‌ కథానాయకుడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఇతివృత్తంతో చిత్తూరు నేపథ్యంలో నడిచే కథాంశమిది రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా విషయంలో సుకుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఐటెంసాంగ్‌ను గత చిత్రాలకు భిన్నంగా ప్రజెంట్‌ చేయాలని భావిస్తున్నారట. ఈ స్పెషల్‌ సాంగ్‌లో బాలీవుడ్‌ సుందరి దిశాపటాని నర్తించబోతున్నట్లు తెలిసింది. ఈ పాట కోసం బాలీవుడ్‌కు చెందిన పలువురు కథానాయికల్ని పరిశీలించిన సుకుమార్‌ చివరకు దిశాపటాని పేరును ఖరారు చేశారని సమాచారం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌పడింది. ఈ చిత్రాన్ని ఐదుభాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.logo