శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 00:24:44

అరణ్య పోరాటం

అరణ్య పోరాటం

‘పారిశ్రామికీకరణ పేరుతో అడవుల్ని నిర్మూలిస్తున్న వారిపై ఓ యువకుడు తన బృందంతో కలిసి ఎలాంటి పోరాటం సాగించాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు రానా. ఆయనహీరోగా నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకుడు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. విష్ణువిశాల్‌ కీలక పాత్రధారి. 2021 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకానుంది.  ‘అడవుల సంరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పే చిత్రమిది. సందేశాత్మక కథాంశానికి వాణిజ్య హంగుల్ని జోడించి తెరకెక్కిస్తున్నాం. అడవుల నిర్మూలనకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా సాగుతున్న పోరాటాలకు దృశ్యరూపంగా ఉంటుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రానా పాత్ర సాగుతుంది. శక్తివంతమైన పాత్రలో విష్ణువిశాల్‌ కనిపిస్తారు’ అని చిత్రబృందం తెలిపింది. జోయాహుస్సేన్‌, శ్రియ పిల్గావోంకర్‌ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:ఏ.ఆర్‌.అశోక్‌కుమార్‌.