గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:11

అర్హకు ప్రేమతో..

అర్హకు ప్రేమతో..

అల్లు అర్జున్‌ గారాల తనయ అర్హ ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ముద్దుల చిన్నారి   శనివారం తన పుట్టినరోజు  వేడుకల్ని జరుపుకుంది. ఈ సందర్భంగా కూతురి కోసం అల్లు అర్జున్‌ ఓ ప్రత్యేకమైన బహుమతిని అందించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమాలోని ‘అంజలి..అంజలి..’ అనే టైటిల్‌ గీతాన్ని అర్హపై రీక్రియేట్‌ చేశారు. ఈ పాటలో చక్కటి హావభావాలతో ముద్దుగా ఒదిగిపోయింది అల్లు అర్హ. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ పాటలో అర్హ అన్నయ్య అయాన్‌, తాతయ్యలు అల్లు అరవింద్‌, శేఖర్‌రెడ్డిలతో పాటు అల్లు అర్జున్‌ నటించారు. గణేష్‌స్వామి ఈ పాటకు నృత్యరీతుల్ని సమకూర్చారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.