శనివారం 30 మే 2020
Cinema - Apr 25, 2020 , 16:25:47

విజయ్‌సేతుపతి‘పుష్ప’నుండి ఎందుకు తప్పుకున్నాడో తెలుసా?

విజయ్‌సేతుపతి‘పుష్ప’నుండి ఎందుకు  తప్పుకున్నాడో తెలుసా?

విలక్షణ నటుడిగా తమిళనాట ప్రశంసలు అందుకున్న విజయ్‌సేతుపతికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి డిమాండ్‌ వుంది. అందుకే ఆ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాడు ఈ తమిళ నటుడు. ప్రస్తుతం తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో ప్రతి నాయకుడిగా ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్న విజయ్‌సేతుపతి ‘అల్లుఅర్జున్‌ ‘పుష్ప’లో కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. ‘ఉప్పెన’ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘మైత్రీ మూవీ మేకర్స్‌' ‘పుష్ప’ కూడా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కూడా విజయ్‌సేతుపతిని ప్రతినాయకుడిగా తీసుకోవాలనుకున్నారు  దర్శకుడు సుకుమార్‌. కాగా ‘ఉప్పెన’ చిత్రానికి 5 కోట్లు పారితోషికం అందుకున్న విజయ్‌సేతుపతి ‘పుష్ప’ చిత్రానికి 10 కోట్లు డిమాండ్‌ చేశాడని సమాచారం. అంతేకాదు పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ‘పుష్ప’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయకూడదని మరో కండిషన్‌ కూడా పెట్టాడు. దీంతో దర్శక, నిర్మాతలు ఆ స్థానంలో మరో పేరున్న నటుడిని తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


logo