క్రాక్ హిందీ రీమేక్..ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు..?

ఈ సంక్రాంతికి బాక్సాపీస్ ను బద్దలు కొట్టిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది రవితేజ నటించిన క్రాక్. రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టిస్తోంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి రీమేక్ విషయంపై బాలీవుడ్ నుంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. తాజాగా ఓ న్యూస్ బీటౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు క్రాక్ హిందీ వెర్షన్ లో నటించే అవకాశాలున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కబీర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న షాహిద్‌కపూర్ పేరు తాజాగా లైమ్ లైట్లోకి వచ్చింది. ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు షాహిద్‌కపూర్.
వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాల రీమేక్‌లో నటిస్తున్న షాహిద్‌కపూర్...మరి క్రాక్ రీమేక్ లో కూడా నటిస్తాడా..? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి..
తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్
రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
పుష్ప స్పెషల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?
శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.