శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 18:41:44

పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?

పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?

నిజంగా ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందా..? మల్టీస్టారర్ చేస్తున్నారా..?  చేస్తే ఆ దర్శకుడు చేస్తున్నాడు..? ఇలా చాలా అనుమానాలు వస్తున్నాయి కదా. ఎందుకంటే మెగా మల్టీస్టారర్ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు అభిమానులు. కానీ వాళ్ల ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. అప్పుడప్పుడూ అన్న సినిమాలో తమ్ముడు.. కొడుకు సినిమాలో తండ్రి కనిపించడమే కానీ నిఖార్సైన మల్టీస్టారర్ ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ఆచార్య సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ పై చాలా వార్తలు పుట్టుకొస్తున్నాయి. పవన్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను కలిపే దమ్మున్న దర్శకుడు తెలుగులో ఎవరున్నారబ్బా అనుకుంటున్నారా..? 

ఈ ధైర్యం మన దర్శకులు కాదు పక్క దర్శకుడు చేయబోతున్నాడు. అవును.. సంచలన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్ దర్శకత్వంలో మెగా మల్టీస్టారర్ రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు శంకర్. నిజానికి ఈయనకు రోబో తర్వాత ఆ స్థాయి విజయం రాలేదు. మధ్యలో వచ్చిన ఐ, 2.0 సినిమాలు పర్లేదు అనిపించాయే కానీ బ్లాక్ బస్టర్ సినిమాలు కావు. ఇప్పుడు ఇండియన్ 2తో బిజీగా ఉన్నాడు. అయితే కమల్ రాజకీయాల కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత పవన్, రామ్ చరణ్ కాంబినేషన్ లో శంకర్ సినిమా ఉండబోతుందని తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. 

రామ్ చరణ్ హీరోగా నటించబోయే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలక పాత్రలో చేయబోతున్నాడని దీని సారాంశం. అతిథి పాత్ర కాదు.. భారీ నిడివి ఉన్న పాత్రలోనే పవన్ నటించబోతున్నాడని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ మల్టీస్టారర్‌ను నిర్మించబోతుంది. ఏదేమైనా కూడా అన్నీ అనుకున్నట్లు జరిగి రామ్ చరణ్, పవన్ కలిసి నటిస్తే అంతకంటే మెగాభిమానులకు కావాల్సిందేం లేదు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్, హరీష్ శంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ కూడా ఆచార్యతో పాటు ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి

క‌మెడీయ‌న్స్ గ్రూప్ ఫొటో.. వైర‌ల్‌గా మారిన పిక్

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo