శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 18:57:10

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్-షో దసరా రోజు మరింత జోష్ పెంచబోతుంది. హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున సినిమా షూటింగ్ నిమిత్తం మనాలి వెళ్లాల్సి వచ్చింది. దాంతో నాగ్ బాధ్యతలను అక్కినేని కోడలు సమంత తీసుకున్నది. ఆదివారం జరగనున్న ఎపిసోడ్ ని సమంత నడిపించనుంది. సమంత హోస్ట్ గా రావడంతో పాటు హైపర్ ఆది పాయల్ రాజ్ పూత్ హీరో కార్తీక్ లు స్టేజ్ పై సందడి చేశారు. హౌస్ సభ్యులతో సమంత ఉన్నప్రోమోలు విడుదల చేశారు.

అయితే సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉండదేమో అని అంతా అనుకుంటున్న సమయంలో సమంత ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపనున్నట్లు సమాచారం. గత వారం మోనాల్ కు తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ వారం కూడా ఆమెకే తక్కువ ఓట్లు పడ్డట్లుగా టాక్ వినిపిస్తుంది. అయినా కూడా ఆమెను ఉంచి దివిని ఎలిమినేట్ చేసినట్లుగా వినికిడి. టాస్క్ ల సమయంలో ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదని అందాల ఆరోబోత తప్ప ఆమె పెద్దగా అక్కటుకోవడంలేదని , సరిగ్గా ఆడడం లేదని టాక్ నడుస్తుంది. దీంతో  ఆమె ఈ వారం ఎలిమినేట్ అవుతుందని సమాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.