శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 15:42:08

బిగ్ బాస్ 4 :టిక్కెట్ టూ ఫినాలే గెలుచుకునేది ఎవ‌రు?

బిగ్ బాస్ 4 :టిక్కెట్ టూ ఫినాలే గెలుచుకునేది ఎవ‌రు?

ఎక్కడ్నుంచి వస్తాయో తెలియదు కానీ బిగ్ బాస్ లో మాత్రం చాలా కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. కంటెస్టెంట్స్ కు చుక్కలు చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు బిగ్ బాస్. వాళ్లకు ఊరికే ఇవ్వడం లేదు కదా లక్షలకు లక్షలు పారితోషికం అందుకే వాళ్ల నుంచి రావాల్సిందంతా రాబట్టుకుంటాడు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ వాళ్ల జ్యూస్ పిండేస్తుంటాడు బిగ్ బాస్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అసలే గేమ్ మరో మూడు వారాలు మాత్రమే ఉంది. పైగా రేస్ 2 ఫినాలే కూడా మొదలైపోయింది. అక్కడ కళ్ల ముందు ఓ టికెట్ కూడా పెట్టాడు. అది దక్కించుకుంటే ఏకంగా ఫైనల్ వీక్‌లోకి వెళ్లిపోవచ్చు. 

ఎలాంటి బాధలు లేకుండా.. నామినేషన్స్ నుంచి తప్పించుకుని సింపుల్ గా ఫైనల్ 5లో ఉండిపోవచ్చు. దాంతో ఈ టికెట్ కోసం కొట్టుకుంటున్నారు కంటెస్టెంట్స్. దానికి కూడా ఓ ప్లాన్ వేసాడు బిగ్ బాస్. అక్కడ గ్రౌండ్ ఏరియాలో ఓ ఆవు బొమ్మను ఉంచి.. బజర్ మోగినపుడు అందులోంచి ఎవరు ఎక్కువగా పాలు పితికి తమ దగ్గర డబ్బాలు నింపుతారో వాళ్లే విజేతలు.. వాళ్లకే ఈ టికెట్ వస్తుందని చెప్పాడు బిగ్ బాస్. అంతే రెచ్చిపోయారు మన వాళ్లు. ఫిజికల్ టాస్కులు అంటే ముందు వెనక చూసుకోకుండా రెచ్చిపోయే సోహైల్ ఇందులో కూడా కుమ్మేస్తున్నాడు. 

డబ్బా నింపుకోడానికి.. పాలు పితుక్కోవడానికి ఓ రేంజ్ లో దూకుడు చూపిస్తున్నాడు. మిగిలిన వాళ్లు కూడా అంతా బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అవినాష్ పాల డబ్బా పగిలిపోయింది. దాంతో మనోడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కావాలనే తనను అంతా టార్గెట్ చేసారని.. ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారని సీరియస్ అయ్యాడు. సోహైల్ నే టార్గెట్ చేస్తూ రెచ్చిపోయాడు. ఈ ప్రోమో చూస్తుంటే కచ్చితంగా రేస్ 2 ఫినాలే టికెట్ మాత్రం సోహైల్ లేదంటే అఖిల్ లలో ఎవరో ఒకరికి వచ్చేలా కనిపిస్తుంది. మిగిలిన వాళ్లంతా బాగానే ఆడుతున్నా ఫిజికల్ టాస్క్ కావడంతో ఈ ఇద్దరూ దూకుడు మీదున్నారు.logo