క్రియేటర్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యుడిగా పని చేసిన బుచ్చిబాబు.. ఉప్పెన సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. కొత్త హీరో, కొత్త హీరోయిన్‌తో ఈ డెబ్యూ డైరెక్టర్ చేసిన ప్రయత్నం మంచి విజయవంతం అయింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లను కలెక్ట్ చేసి అందరిని అవాక్ అయ్యేలా చేసింది.
ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు ఏ హీరోతో చేస్తాడనేది ఆసక్తికరంగా మారగా, ఆ మధ్య ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం నడిచింది. ఆ తర్వాత మళ్లీ వైష్ణవ్ తేజ్‌తోనే చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు తన రెండో సినిమాను ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
వైష్ణవ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు సినిమాలతో చాలా బిజీగా ఉండడం వలన ఆయన తన తదుపరి సినిమాని ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ యంగ్ హీరో ఎవరనేది సస్పెన్స్. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. బుచ్చిబాబు రెండో సినిమాకి కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు అని అంటున్నారు.