మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 17, 2020 , 14:30:46

బిగ్ బాస్ లో ఈ వారం ఎవరు ఎలిమినేటర్ ఎవ‌రో తెలుసా?

బిగ్ బాస్ లో ఈ వారం ఎవరు ఎలిమినేటర్ ఎవ‌రో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 4 రాను రాను మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుని 11వ వారంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎవరు బయటికి వస్తారు.. ఎవరు ఇంట్లో ఉండబోతున్నారు అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ప్రతి వారం అనుకోని ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం చాలామంది మెహబూబ్ చివరి నిమిషంలో అయినా సేవ్ అవుతాడు అనుకున్నారు. కానీ ఆ కుర్రాడు ఇంటికి వచ్చేశాడు. దాంతో అందరి దృష్టి వచ్చేవారంపై పడింది. ఎప్పట్లాగే నామినేషన్స్ లో అభిజిత్, మోనాల్, హారిక కంటిన్యూ అయ్యారు. వాళ్లకు తోడుగా ఈ వారం లాస్య, అరియానా, సోహైల్ కూడా ఉన్నారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అభిజిత్ ఎలిమినేట్ కావడం దాదాపు అసాధ్యం. ఆయన విన్నర్ అవుతాడు అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం మొదలైంది. లాస్య కూడా చివరి వరకు ఉండటం లాంఛనమే. మిగిలిన వాళ్లలో సోహైల్ టాప్ 5 కంటెస్టెంట్ అని ప్రచారం జరుగుతోంది. అంటే ఈ వారం ఈ సింగరేణి బిడ్డకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఖచ్చితంగా సేవ్ అవుతాడు. మరోవైపు అరియానా కూడా డేంజర్ జోన్ లో ఏం లేదు. తన గేమ్ తో చాలా మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి నిజాయితీతో ఆడుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. తర్వాత వారం పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ వారం మాత్రం అరియానా సేవ్ అయ్యేలా కనిపిస్తోంది. 

ఇప్పటికే ఓట్ల ప్రక్రియలో చూస్తే అభిజిత్ అందరికంటే ముందున్నాడు. ఆయన తర్వాత లాస్య, సోహైల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానంలో అరియానా ఉంది. దాంతో ఈ వారం డేంజర్ జోన్ లో హారిక, మోనాల్ ఉన్నారు. ఈ ఇద్దరికీ ఓట్లు అనుకున్న స్థాయిలో పడటం లేదని ప్రచారం జరుగుతుంది. గేమ్ చివరి దశకు రావడంతో ఈవారం ఈ ఇద్దరి మధ్య పోటీ నడుస్తోంది. తెలుగమ్మాయి కావడంతో ఇద్దరిలో కాస్త హారికకు ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ప్రతి వారం మోనాల్ సేవ్ అవుతూనే ఉంది. అది ఎలా అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. మరి ఈ వారం కూడా ఈమె ఇలాగే బయట పడిపోతే చెప్పలేము కానీ లేదంటే మాత్రం కచ్చితంగా ఇంటినుంచి ఈ గుజరాతీ అమ్మాయి అడుగు బయట పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ మోనాల్ సేవ్ అయితే మాత్రం హారిక వారందరి బ్యాగ్ సర్దుకోవాల్సిందే. చూడాలిక ఏం జరుగుతుందో


logo