శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 10:24:49

ఈ వారం ఎలిమినేట‌ర్ ఎవ‌రు అంటే ?

ఈ వారం ఎలిమినేట‌ర్ ఎవ‌రు అంటే ?

12వ వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియలో నాట‌కీయ‌త చోటు చేసుకుంది. నామినేష‌న్‌లో చివ‌ర‌కు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అరియానా, అవినాష్ మిగిలారు. ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్ కానున్నార‌ని చెప్ప‌డంతో వారిద్ద‌రి టెన్ష‌న్ మొద‌లైంది. అయితే అవినాష్ ద‌గ్గ‌ర ఎవిక్ష‌న్ పాస్ ఉండడంతో దానిని ఉప‌యోగించి ఎలిమినేష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డొచ్చు అని నాగ్ పేర్కొన్నారు. అయితే ఈ పాస్‌ని వ‌చ్చే వారం అయిన ఉప‌యోగించుకోవ‌చ్చు లేదంటే నువ్వు సేవ్ అయితావ‌నే న‌మ్మ‌కం ఉంటే అరియానాకి కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు అని నాగ్ పేర్కొన్నారు. 

నా సిక్స్త్ సెన్స్ నేను ఎలిమినేట్ అవుతాన‌ని అనిపిస్తుంది. ఈ ఎవిక్ష‌న్ పాస్ నేనే వాడ‌తాన‌ని నాగ్‌తో చెప్పాడు అవినాష్‌. అయితే ఒక‌సారి హౌజ్‌మేట్స్ స‌ల‌హా కూడా తీసుకో. అరియానాతో కూడా డిస్క‌స్ చేయ‌ని నాగ్ అన‌డంతో అంద‌రి స‌ల‌హా మేర‌కు ఎవిక్ష‌న్ పాస్ తానే వాడుకున్నాడు. వారి ముందు ఉన్న‌ రెండు టీపీల‌లో ఎవ‌రి చేతికి రెడ్ క‌ల‌ర్ అంటుతుందో వారి ఎలిమినేట్ అవుతారు, గ్రీన్ క‌లర్ వ‌చ్చిన వారు సేవ్ అవుతారు అని నాగ్ పేర్కొన్నారు.

అరియానా, అవినాష్ ఇద్దరూ చేతులు టోపిలో పెట్ట‌గా,  అవినాష్ కు రెడ్ కలర్ వచ్చింది. అరియానాకి గ్రీన్ కలర్ వచ్చింది. ఎవిక్ష‌న్ పాస్ వ‌ల‌న అత‌ను సేవ్ అయ్యాడు. అవినాష్ నిర్ణ‌యం ప‌నికొచ్చిందని, ఈ వారం ఎలిమినేష‌న్ లేదంటూ నాగ్ తెలిపారు. మొత్తానికి ఎవిక్షన్ పాస్ డ్రామాతో ఈవారం ఎలిమినేషన్ లేకుండా చేశారు. అయితే ఎవిక్ష‌న్ పాస్ వ‌ల‌ననే నేను సేవ్ అయ్యాను.ప్రేక్ష‌కులు న‌న్ను ఎలిమినేట్ చేశారంటూ తెగ ఆందోళ‌న చెందాడు అవినాష్‌. ముందుకు వెళ్ళాలా ఆగాలా తెలియ‌డం లేదంటూ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న చెందాడు. ‘నువ్ సెల్ఫ్ సింపథీలోకి వెళ్లకు.. ఎవరికి వారు ఆట బాగా ఆడండి’ అంటూ ధైర్యం చెప్పారు నాగార్జున. ఎవిక్ష‌న్ పాస్ ఉంద‌నే ప్రేక్ష‌కులు నీకు త‌క్కువ ఓట్లు వేసి ఉండొచ్చు.  ఈ సారి నామినేష‌న్‌లోలేని వారి క‌న్నా నువ్వు స్ట్రాంగ్ అయి ఉండొచ్చు అంటూ అవినాష్‌కు ధైర్యం నూరిపోశారు నాగార్జున‌.దీంతో ఈ వారం కూడా హౌజ్‌లో ఏడుగురు స‌భ్యులు ఉండ‌నున్నారు.


logo