గురువారం 21 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 09:33:23

ఈ సీజ‌న్ బెస్ట్ కెప్టెన్ ఎవ‌రంటే ?

ఈ సీజ‌న్ బెస్ట్ కెప్టెన్ ఎవ‌రంటే ?

బిగ్ బాస్ ఇచ్చిన ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ని స‌క్ర‌మంగా చేయ‌ని కార‌ణంగా ఆయ‌న ఇంటి స‌భ్యుల‌పై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అభిజీత్ చేయ‌న‌ని మొండికేసి కూర్చోవ‌డం కరెక్ట్ కాదంటూ చీవాట్లు పెట్టాడు. ఈ నేప‌థ్యంలో వివ‌ర‌ణ ఇచ్చిన అభి.. మోనాల్‌ని ఏడిపించాం అనే ప‌దం నాకు న‌చ్చ‌లేదు బిగ్ బాస్. ప‌ర్స‌న‌ల్ గా హ‌ర్ట్ అయ్యాను. 12 వారాల‌లో చాలా సార్లు హ‌ర్ట్ అయ్యాను. దీనిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకున్నావు. నా వ‌ల‌న తప్పిదం జ‌రిగితే క్ష‌మించండి బిగ్ బాస్ అని అభి అన్నాడు 

అనంతరం రేస్‌ టూ ఫినాలే మొద‌లైందనా చెప్పిన బిగ్ బాస్ .. ఇక ఇంటికి కెప్టెన్ ఉండ‌ర‌ని అన్నారు. అయితే ఇన్ని రోజులు ఇంటికి కెప్టెన్‌గా ఉన్న వారిలో బెస్ట్ ఎవ‌రు, వ‌ర‌స్ట్ ఎవ‌రో చెప్పాల‌ని బిగ్ బాస్ ఆదేశించ‌డంతో చ‌ర్చ మొద‌లైంది. ముందుగా సోహైల్ త‌న కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. చాలా క‌ష్ట‌ప‌డి కెప్టెన్ అయ్యాను. ఇంటిని స‌క్ర‌మంగా ముందుకు తీసుకెళ్లానంటూ చెప్పుకొచ్చాడు. ఇక అరియానా త‌న కెప్టెన్సీ గురించి చెబుతూ..మార్పు నా కెప్టెన్సీతోనే మొద‌లైంది. ఇంటి స‌భ్యులంద‌రిని స్ట్రిక్ట్‌గా ఉంచుతూనే వారికి స్పేస్ ఇచ్చాన‌ని చెప్పుకొచ్చింది. 

అఖిల్ త‌న కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. చాలా క‌ష్ట‌ప‌డితే కాని కెప్టెన్సీ రాలేదు. న‌న్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సీక్రెట్ రూంకి పంపారు. అక్క‌డ చాలా ఫేస్ చేశాను. ల‌క్ మీద కెప్టెన్సీ వ‌చ్చింద‌ని అంద‌రు అంటారు. అక్క‌డ నామినేష‌న్ ఉంది, దానిని నుండే కెప్టెన్సీ వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఇక హారిక త‌న కెప్టెన్సీ సూప‌ర్‌గా ఉంద‌ని చెబుతూ, లీడ‌ర్ షిప్ స్క్రిల్స్ నాలో బాగా ఉన్నాయ‌ని అర్దమైందని పేర్కొంది. 

ఇలా కెప్టెన్ అయిన వారంద‌రు వారి గురించి చెప్పుకోగా, హారిక‌ను బెస్ట్ కెప్టెన్‌గా అవినాష్‌, అభిజిత్‌లు ఎన్నుకున్నారు.  అరియానా అవినాష్‌ని, మోనాల్‌ సోహైల్‌ పేరును చెప్పారు. అయితే అంతా ఏకాభిప్రాయంతో హారికని బెస్ట్ కెప్టెన్‌గా నిర్ణ‌యించారు.


logo