శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 18:28:03

అవినాష్, మోనాల్‌కు నాగార్జున క్లాస్.. తప్పు ఎవరిది..?

అవినాష్, మోనాల్‌కు నాగార్జున క్లాస్.. తప్పు ఎవరిది..?

బిగ్‌బాస్‌-4 తెలుగులో ఓ ఆనవాయితీ కొనసాగుతోంది. శనివారం నాగార్జున వచ్చాడంటే చాలు ఎవర్ని సేవ్ చేస్తాడనే దాని కంటే కూడా.. ఆ రోజు ఎవర్ని టార్గెట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారుతున్నది. వారం జరిగిన రచ్చలపై ఆ రోజు చర్చ జరుగుతుంది. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అంటూ పెదరాయుడు రేంజ్ లో తీర్పు ఇస్తుంటాడు నాగార్జున. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. గతవారం కూడా ఇంట్లో చాలా విచిత్రాలు జరిగాయి. అందులో మరీ ముఖ్యంగా అవినాష్, మోనాల్ మధ్య జరిగింది. నామినేషన్ ప్రక్రియ ముసిగిన తర్వాత రేస్ టూ ఫినాలే టికెట్ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగానే అందరూ గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు బొమ్మ నుంచి వచ్చే పాలు పితకాల్సి ఉంటుంది. ఎవరైతే అక్కడ్నుంచి ఎక్కువ పాలు పితికి.. తమ డబ్బాల్లో నింపుతారో వాళ్లు తర్వాతి రౌండ్ కు అర్హులు అవుతారు. 

ఈ ఆటలో అందరికంటే ముందు అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే పాలు పితికే క్రమంలోనే తనను మోనాల్ కాలితో తన్నిందని చాలా పెద్ద రచ్చ చేసాడు అవినాష్. ఈ ఇంట్లో అమ్మాయిలు ఏం చేసినా తప్పు కాదు.. నేనేం చేసినా తప్పు అవుతుందంటూ సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదంటూ రెచ్చిపోయాడు. అయితే మోనాల్ కూడా తాను కావాలని అలా చేయలేదని.. పొరపాటుగా జరిగిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇదే విషయం నాగార్జున ముందుకొచ్చింది. నిన్ను మోనాల్ కావాలనే కాలితో తన్నిందా అవినాష్ అంటూ నాగార్జున అడిగితే అవును అని సమాధానం చెప్పాడు. 

అంతేకాదు తన్నిన తర్వాత తన వైపు చాలా సెటైరికల్ గా ఓ రకమైన చూపు చూసిందని చెప్పుకొచ్చాడు అవినాష్. మరోవైపు అరియానా కూడా ఇదే చెప్పింది. ఆ సంఘటన తర్వాత ఏదో నవ్వుతో మోనాల్ మొహం కనిపించిందని.. ఆ నువ్వుతో ఇతరులకు సైగలు చేసిందని చెప్పింది అరియానా. మరోవైపు మోనాల్ మాత్రం తను అలిసిపోయానని.. ఇలాంటివి వింటుంటే బాధగా ఉందని చెప్పింది. ఏదేమైనా కూడా ఈ ఇద్దరిలో తప్పెవరిది అనేది మాత్రం నాగార్జున తేల్చనున్నాడు. మరోసారి వీడియోను చూపించి ఎవరు తప్పు చేసారో ప్రేక్షకుల ముందు పెట్టబోతున్నాడు మన్మథుడు. logo